కామెడీ షోలను తలదన్నేలా ఆహా స్కెచ్.. ప్రోమో రిలీజ్

0
277

ఓటీటీ ప్రపంచంలో కొంత ట్రెండ్ ను సృష్టిస్తూ కొనసాగిస్తుంది ‘ఆహా’. ప్రతి షోను వినూత్నంగా రూపుదిద్దుతోంది. ప్రోమో నుంచి ప్రజంటేషన్ వరకూ న్యూ ట్రెండ్ కు తెరలేపుతున్నది ఈ ఓటీటీ ప్లాట్ ఫాం. తెలుగు ఇండియన్ ఐడల్, చెఫ్ మంత్రా, అన్ స్టాపబుల్, డ్యాన్స్ ఐకాన్, లాంటి ప్రేక్షకాధరణ కలిగిన షోలను ప్రజెంట్ చేసి ఆకట్టుకుంది. వీటితో పాటు ట్రెండింగ్ మూవీలను కూడా అందిస్తుండడం విశేషం.

అంచనాలను పెంచిన ప్రోమో..

ఇందులో భాగంగానే ఆహా ఒక కామెడీ షోను డిజైన్ చేసింది. ‘కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్’ పేరుతో ఇది డిసెంబర్ 2వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని ఆహా యాజమాన్యం డేట్ కూడా ఫిక్స్ చేసింది. ఇటీవల దీనికి సంబంధించి ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో సుడిగాలి సుధీర్ తో కలిసి దీపికా పిల్లి హోస్ట్ లుగా వ్యవహరిస్తుండగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా ఉంటారు. ఈ షోలో విన్నర్ ను ఫైనల్ చేసే అధికారం ప్రేక్షకులపైనే ఉంచారు.

ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా

ఇప్పటి వరకూ ఈ టీవీలో కొనసాగుతున్న జబర్దస్త్, జీ తెలుగులో అదిరింది, మా టీవీలోని కామెడీ స్టార్స్ షోలకంటే ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో కమెడీయన్లుగా అవినాష్, వేణు, సద్దాం, యాదమ్మ రాజు, జ్ఞానేశ్వర్, తదితరులు టీమ్ లీడర్లుగా వ్యవహరించనున్నారు. ప్రతీ ఎపిసోడ్ విన్నర్ ను స్థానికంగా ఉండే ప్రేక్షకులే నిర్ణయిస్తారు. దీనిపై కామెడీని ఎక్కువగా ఆశ్వాదించే ప్రేక్షకులు ఉత్సుకతతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు. ప్రోమోనే అంచనాలను పెంచుతుంది. ఇక ఏ మేరకు అలరిస్తుందో చూడాలి మరి.