తెలుగులో ప్రమోషన్లకు నయన్ దూరం.. అందుకేనా..?

0
644

లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న నయనతార ప్రమోషన్లకు దూరంగా ఉంటుంది. ఎంత పెద్ద సినిమా అయినా లేడీ ఓరియంటెడ్ సినిమా అయినా ఇప్పటి వరకూ అమ్మడు ప్రమోషన్ లో పాల్గొన్నట్లు చరిత్రలో లేదు. ఈ విషయం ఆమె ఫ్యాన్స్ తో పాటు మీడియాకు కూడా బాగానె తెలుసు. సినిమా వరకే తన రోల్, ఈవెంట్లు, ప్రమోషన్లు అనేవి తనకు అస్సలు ఇష్టం ఉండవని చెప్పకనే చెప్తుంది నయనతార. గాడ్ ఫాదర్ టైంలో ప్రమోషన్ కు దూరంగా ఆమె విషయంలో కొన్ని కామెంట్లు వచ్చాయి.

బాలయ్యతో ‘జైసింహా’ సినిమా

ఇప్పుడంటే ఆమె పిల్లలు, హనీమూన్ నేపథ్యంలో బిజీగా ఉన్నా. గతంలో కూడా ‘సైరా నర్సింహారెడ్డి’, ప్రమోషన్ ఈవెంట్లలో కూడా ఆమె కనిపించలేదు. ప్రస్తుతం బాలయ్యతో ‘జైసింహా’ సినిమా చేసినా ఇందులోనూ పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. శ్రీరామరాజ్యంలో సీతపాత్ర చేసిన నయన్ కొంచెం బయటకు కనిపించింది. గతంతో పాటు జైసింహా వరకూ ఆమె ఎటువంటి ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొనలేదు.

‘కనెక్ట్’తో కనెక్టయిన నయన్

ఇటీవల నయనతార ఒక సినిమాలో నటించింది. ఈ సినిమాకు మాత్రమే ఆమె మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అదీ తెలుగు యాంకర్ సుమకు ఈ చిత్రంపై ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది నయన తార. ఈ ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలతో పాటు టాలీవుడ్ స్టార్ యాక్టర్స్, డైరెక్టర్, కో ఆర్టిస్టుల గురించి చెప్పుకచ్చింది అమ్మడు. ఇన్నళ్ల కరువును ఒక్కసారిగా తీర్చుకున్నట్లు ఉంది ఈ ముద్దుగుమ్మ. నయన తార రీసెంట్ మూవీ ‘కనెక్ట్’.

లాక్ డౌన్ సమయంలో ఒంటరిగా

ఇది చిన్న సినిమాగానే చెప్పాలి. దాదాపు గంటన్నర మాత్రమే ఉన్న సినిమాపై ఆమె ప్రమోషన్ చేయడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అంత పెద్ద స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన సినిమాలు బాక్సాఫీస్ కలెక్షన్లను కురిపించాయి. వాటితో పోల్చుకుంటే ‘కనెక్ట్’ పెద్ద సినిమా అస్సలు కాదు. ఇక స్టోరీ పరంగా కూడా కొత్తదేమీ కాదు. లాక్ డౌన్ సమయంలో ఒంటరిగా ఉన్న వ్యక్తులకు దయ్యం పడితే ఎలా ఉంటుంది అన్న పాయింట్ తో సినిమాకు తెరకెక్కించారు.

కెరీర్ పై మరింత దృష్టి పెట్టాలి

కనెక్ట్ తో నయనతారలో వచ్చిన మార్పు ఒక్క ఈ సినిమాకే పరిమితమా.. లేక ఇక ముందు కూడా ఇలానే పాల్గొంటుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు సినీ విశ్లేషకులు, అభిమానుల్లో మెదులుతున్నాయి. చిన్న సినిమా కాబట్టి స్వయంగా ఆమెనే ప్రమోషన్ కు దింపాలని చిత్ర యూనిట్ భావించి ఇలా చేసిందా అన్నది తెలియాల్సి ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి దేశ విదేశాల్లో తమ సినిమాల కోసం ప్రమోషన్లు చేస్తుంటే ఈ అమ్మడు మాత్రం ఇలా ఉండడం కరెక్టు కాదంటున్నారు సినీ విశ్లేషకులు.

ఆఫర్లు కూడా తగ్గవచ్చు

ఇప్పుడు సరోగసితో ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నయనతారకు రాను రాను ఆఫర్లు కూడా తగ్గవచ్చు. ఇప్పటి నుంచే కెరీర్ పై మంచి ఫొకస్ పెడితే మరికొంత కాలం ఇండస్ర్టీలో కొనసాగుతుందని, లేదంటే వెనక్కు వెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.