మళ్లీ గర్జించనున్న బాలయ్య`బోయపాటి కాంబో..

0
265
Balayya Boyapati combo is going to roar again

కొన్ని కాంబినేషన్‌లు భలే ఆసక్తికరంగా ఉంటాయి. ఈ కాంబినేషన్‌ దొరికితే చాలు నిర్మాతలు నక్కను తొక్కినట్టే. క్రేజీ కాంబినేషన్‌లు అంటే హీరో`హీరోయిన్లు, హీరో`దర్శకులు, నిర్మాత`దర్శకులు, నిర్మాత`హీరోలు ఉంటాయి.

వీటిలో ప్రస్తుత ట్రెండ్‌ ప్రకారం చూస్తే.. హీరో`దర్శకుడి కాంబినేషన్‌కే భారీ క్రేజ్‌ ఉంటోంది. ఇప్పటికీ పలు భారీ విజయాలు నమోదు చేసిన ఈ కాంబోలో మరో సినిమా రాబోతోంది అంటే..

అటు అభిమానులకు, ఇటు బయ్యర్లకు పండగే అని చెప్పాలి. ఇలా బాక్సాఫీస్‌ను షేకాడిరచిన కాంబో నటసింహం నందమూరి బాలకృష్ణ ` దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌.

2010లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహ’ సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. అప్పటికి డౌన్‌ఫాల్‌లో ఉన్న బాలయ్య కెరీర్‌కు అద్భుతమైన బూస్టప్‌ ఇచ్చిని సినిమా ఇది.

బాలయ్య సరసన నయనతార, నమిత, స్నేహా ఉల్లాల్‌లు నటించడంతో మాంచి క్రేజ్‌ వచ్చింది. యువ సంగీత దర్శకుడు చక్రి అందించిన పాటలు సూపర్‌హిట్‌ అవ్వటం సినిమాకు మరింత ప్లస్‌ అయ్యింది.

ఆ తర్వాత 2014లో బాలయ్య`బోయపాటి కాంబోలో వచ్చిన ‘లెజెండ్‌’ కూడా ఇండస్ట్రీ హిట్‌ రేంజ్‌కు వెళ్లడంతో వీరి కాంబినేషన్‌పై మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

దాన్ని రీచ్‌ అవ్వడం ఆసాధ్యమనే స్థాయికి వెళ్లిపోయింది. దీంతో కొంతకాలం గ్యాప్‌ తీసుకున్న వీరు 2021లో ‘అఖండ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Mahesh Trivikrams combination closed the career of two producers

ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించి రికార్డులు తిరగరాసింది. ఇలా వరుస హిట్‌లు ఇచ్చిన ఈ కాంబినేషన్‌పై ట్రేడ్‌ వర్గాల్లో కూడా సూపర్‌ క్రేజ్‌ ఉంది.

అఖండ తర్వాత వీరి కాంబోలో రాబోయే సినిమా కోసం బాలయ్య అభిమానులు, ఇండస్ట్రీ ట్రేడ్‌ వర్గాలు ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

తాజాగా వారి ఆతృతకు చెక్‌ పెడుతూ బాలయ్య`బోయపాటి కాంబో మరోసారి రిపీట్‌ అవ్వనుంది. బాలయ్యతో బోయపాటి సినిమా కన్‌ఫర్మ్‌ అయ్యిందట.

దీనికి సంబంధించి బాలయ్య దగ్గర బోయపాటి ఓ లైన్‌ ఆమోద ముద్ర కూడా వేయించుకున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది.

ఇది అఖండ`2 సినిమానా? లేక వేరే సినిమానా అనేది క్లారిటీ రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడానికి వస్తున్న ఈ సినిమా నిర్మాత ఎవరనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్‌ అట.