అనుష్క అతన్నే పెళ్లి చేసుకుంటుంది..?

0
1054

మోస్ట్ ఎలిజబెల్ లేడీ బ్యాచ్‌లర్ గా పేరు తెచ్చుకున్న వారిలో అనుష్క ఒకరు. అప్పట్లో ప్రభాస్ తో పెళ్లి వార్తలను కొట్టి పారేసిన ఆమె తర్వాత ఎవరిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అని చెప్పలేదు. కానీ ఇటీవల ఆమె తన సొంత ఊరిలో జరిగిన భూత కోళా వేడుకల్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆమె పెళ్లి చేసుకోబోతుందని, అందుకే మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా నిజమేనంటూ చెప్పడంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లకు ఆమె పెళ్లి చేసుకోబోతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పెళ్లి వార్తలే ప్రముఖంగా వింటాం

ఇకపై అనుష్క గురించి వచ్చే వార్తల్లో ఆమె పెళ్లికి సంబంధించినవే ఉంటాయని తెలుస్తోంది. తెలంగాణలోని ఒక బంగారు వ్యాపారిని అనుష్క శెట్టి పెళ్లాడబోతోందట. ఆమె పెళ్లి వార్తలపై ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ జగన్నాథ్ గురూజీ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకచ్చారు. ప్రస్తుతం ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

2023లో పెళ్లి పీటలు ఎక్కనున్న అనుష్క శెట్టి

‘అనుష్క శెట్టి త్వరలోనే పెళ్లి చేసుకుంటుంది. అది నిజమే. ఆమెకు వివాహ గడియలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఆమె గ్రహాలు ఉచ్ఛ స్థితిలో ఉన్నాయి. బుధుడు, చంద్రుడు మంచి స్థానాల్లో ఉన్నారు. వీటన్నింటినీ బట్టి చూస్తే 2023లో వివాహం తప్పనిసరి కాబోతోంది. సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తిని కాకుండా బయటి వారిని పెళ్లి చేసుకుంటుందని మొదట్లోనే వివరించాం. ఆమె జీవితం చాలా సాఫీగా సాగుతుంది. ఆమె జాతకం ప్రకారం భార్యా, భర్తలు అన్యోన్యంగా ఉంటారు. కెరీర్ పరంగా కూడా బాగుంటుంది.’ అని చెప్పారు జగన్నాథ్ గురూజీ.

పండిట్ మాటలపై హర్షం

పండిట్ గురూజీ చెప్పిన విషయాల్లో ఎంత నిజం ఉందోకానీ.. ప్రస్తుతం ఆయన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అనుష్క విషయంలో ఆయన చెప్పిన విషయాలు నిజమైతే ఫ్యాన్స్ కు పండగే మరి. ఇన్నాళ్లకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్కపై అభిమానులు, నెటిజన్లు డిఫరెంట్ గా కామెంట్లు పెడుతున్నారు. 2023 తను పెళ్లి చేసుకోవడం ఖాయమనే కనిపిస్తుంది.

వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అనుష్క

ఇక అనుష్క కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. పెళ్లి సమయం వరకూ దాదాపు ప్రాజెక్టులను పూర్తి చేయాలని అనుకుంటున్నారట. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న ‘చంద్రముఖి-2’లో నటిస్తున్నారు. ఈ సినిమా2023లో విడుదల చేస్తామని గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. నవీన్ పోలిశెట్టితో కలిసి ఒక చిత్రంలో కూడా ఆమె నటిస్తుందట. ఇది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇంకా కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.