వెంకటేశ్ తో ఉన్న వీరిని గుర్తు పెట్టారా..?

0
400

ప్రస్తుతం సోషల్ మీడియా జమానా నడుస్తోంది. ప్రతీ ఒక్కరి జీవితంలోని చిన్ననాటి ఘట్టాలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. సెలబ్రెటీల విషయంలో చూసుకుంటే ఈ ట్రెండ్ మరింత ఎక్కువనే చెప్పాలి. సెలబ్రెటీలకు సంబంధించి చిన్ననాటి పిక్ లను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులకు క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారనే చెప్పాలి.

ఎంతో మంది స్టార్ హీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు చూశాం. ఇంకా చూస్తేనే ఉన్నాం. ఇందులో కొంత మంది హీరోల గత చిత్రాలు, ఇప్పుడున్న వారు.. ఇలా చాలానే చూశాం. తాజాగా ఒక పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో విక్టరీ వెంకటేశ్ తో ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు స్టార్ డైరెక్టర్ కాగా.. మరొకరు యంగ్ హీరో వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పొటోలో కనిపిస్తున్న స్టార్లు

విక్టరీ వెంకటేశ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన ఎన్నో బాక్సాఫీస్ హిట్లు ఇచ్చారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలు చేయడంలో వెంకటేశ్ చాలా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆయన ప్రస్తుతం ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో రాణాతో కలిసి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంకటేశ్ గత చిత్రం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఫొటో ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా షూటింగ్ సమయంలో తీసింది. పిల్లలతో ముచ్చటిస్తున్నట్లుగా ఉంది ఈ ఫొటో. ఇందులో ఒక స్టార్ డైరెక్టర్ ఉంటే మరో స్టార్ హీరో ఉన్నారు. వారెవరో తెలుసుకుందాం.

వారే త్రివిక్రమ్ శ్రీనివాస్, రామ్ పోతినేని

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వినిపించే పేరు. ఈయన డైరెక్టర్ గానే కాకుండా మాటల మాంత్రికుడిగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు మాటలు సమకూర్చింది కూడా త్రివిక్రమ్ శ్రీనివాసే. ఇక నల్ల టీ షర్ట్ ధరించి వెంకటేశ్ తో కనిపిస్తున్న కుర్రాడు రామ్ పోతినేని. ప్రస్తుతం రామ్ పోతినేని ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపు దక్కించుకొని చాల సినిమాల్లో కనిపిస్తున్నారు.

రామ్ కు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ ఫొటో చూసిన నెటిజన్లు తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. టీనేజ్ లో కూడా రామ్ చాలా అందంగా ఉన్నాడంటూ చెప్తున్నారు. దీనితో పాటు త్రివిక్రమ్ ను చూసిన వారంతా ఈ టాప్ డైరెక్టర్ యంగ్ ఏజ్ లో బాగున్నాడని కామెంట్లుపెడుతున్నారు.

ప్రస్తుతం రామ్, త్రివిక్రమ్ కెరియర్

రామ్ పోతినేని రీసెంట్ గా ది వారియర్ సినిమా చేశాడు. కానీ అది అంతగా ఆడలేదు. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. వాటితోనైనా ఆయన అలరిస్తారా అని చూడాలి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఎంత చెప్పనా తక్కువే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఎన్నో బాక్సాఫీస్ హిట్లు ఇచ్చారు. రీసెంట్ గా మహేశ్ బాబుతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. గతంలో మహేశ్ బాబుతో చేసిన ఒక్కడు సినిమా బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు కూడా అలాంటి సినిమానే చేయాలని చూస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.