విలన్స్ గా హీరోలుగా ఎదిగిన హీరోలు

0
854

సినీ ఇండస్ట్రీలోని వెళ్లాలనే ఇంట్రస్ట్ తో వచ్చిన వారికి మొదటి సినిమాతోనే హీరో అవకాశాలు రావు. ఎంత పెద్ద యాక్టర్ అయినా మొదట కొన్ని చిన్న చిన్న పాత్రలను వేయాల్సిందే. హీరోకి ఫ్రెండ్ గా, విలన్ కు ఫ్రెండ్ గా లేదా విలన్ గా ఇలాంటి పాత్రల ద్వారా వారికి నటన, సెట్, షూటింగ్ ఈ తరహా వ్యవహారాలపై కూడా గ్రిప్ పెరుగుతుంది.

టాలీవుడ్ విషయానికి వస్తే కెరీర్ మొదట విలన్ గా నటించి తర్వాత హీరోలుగా మారి బాక్సాఫీస్ హిట్లను కట్టబెట్టిన వారిలో ఇప్పటికీ మొదటి వరుసలో నిలుచునే స్టార్లే ఉన్నారు. చిరంజీవి, రజినీకాంత్, మోహన్ బాబు, శ్రీహరి, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. ఎంత పెద్ద నటుడు అయినా చిత్ర సీమకు వచ్చిన మొదట్లో ఒక సాధారణ హీరో పక్కన చేయడం కామనే. విలన్ గా చిత్ర సమలో అడుగుపెట్టి స్టార్ హీరోలుగా మారిన మన టాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం.

చిరంజీవి

కొణిదెల శివశంకర వరప్రసాద్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి మొదట్లో విలన్, కో యాక్టర్ పాత్రలు మాత్రమే వేశారు. చేసినవి తక్కువ సినిమాలే అయినా విలన్ అనగానే మొదట గుర్తుకు వచ్చే పేరు చిరంజీవి అంతలా నటించి మెప్పించాడు. మోసగాడు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, 47 రోజులు లాంటి సినిమాల్లో విలన్ గా కనిపించిన చిరంజీవి తర్వాత హీరోగా మారి టాలీవుడ్ ఇండస్ట్రీలో కీరోల్ పోషించే స్థాయికి ఎదిగాడు.

రజనీకాంత్

బస్ కండక్టర్ నుంచి నటుడిగా మారిన రజనీకాంత్ మొదట విలన్ క్యారెక్టర్లు మాత్రమే వేసేవారు. తమిళం ఆయన మాత్ర భాష అయినా, తెలుగు ఇండస్ట్రీలో కూడా బాగా రాణించారు. కథా సంగమం, జాను, బాలు వంటి సినిమాలలో విలన్ గా నటించాడు. ఇప్పుడు కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా స్టార్ యాక్టర్ గా మారి కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు.

మోహన్ బాబు

మంచు మోహన్ బాబు విలన్ పాత్రలకు పెట్టింది పేరుగా ఎదిగాడు. మొదట దశ మొత్తం ఎన్నో విలన్ పాత్రలను ధరించాడు. తలంబ్రాలు సినిమాలో ఆయన చేసిన విలన్ పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. తర్వాత హీరోగా అవకాశాలు రావడంతో ఆ వైపు వెళ్లిన ఆయన కలెక్షన్ కింగ్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. అల్లుడిగారు సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది.

రాజశేఖర్

రాజశేఖర్ కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రల్లో బాగా నప్పేవారు. విలన్ గా చాలా సినిమాల్లో నటించారు. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, వారసుడు, అబ్బాయిగారు లాంటి సినిమాల్లో ఆయన విలన్ గా నటించారు. అంకుశం, ఆహుతి, తదితర సినిమాలతో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం అగ్ర హీరోగా రాణిస్తున్నారు.

వీరే కాకుండా రవితేజ, శ్రీహరి, శ్రీకాంత్, గోపీచంద్ ఇలా చాలా మంది హీరోలు విలన్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకొని క్రమ క్రమంగా హీరోగా ఎదిగారు. తర్వాత వారి రికార్డులకు హద్దు లేకుండా పోయింది.