40 ఏళ్ళ వయస్సులో పెళ్లి పీటలు ఎక్కబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..వరుడు ఎవరో మీరే చూడండి!

0
223
Heroine Pawan Kalyan is going to get married at the age of 40

కొంతమంది హీరోయిన్లు చేసింది కొన్ని సినిమాలే అయ్యినప్పటికీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ముద్ర వేసి పోతారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు మీరా చోప్రా. ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బంగారం’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోయినప్పటికీ కూడా ఆమెకి మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమెకి ఎక్కువగా అవకాశాలు రాలేదు. చూసేందుకు అందంగా ఉంటుంది, బాగా నటిస్తుంది కూడా.

Heroine Pawan Kalyan is going to get married at the age of 40

హీరో ధనుష్ తో రెండవ పెళ్లి పై మీనా సంచలన కామెంట్స్!

అయినప్పటికీ అవకాశాలు పెద్దగా రాలేదు అంటే ఆమె బ్యాడ్ లక్ అనే చెప్పాలి. అయితే ఈమె సోషల్ మీడియా లో మొదటి నుండి యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది.

తన అభిప్రాయాలను ఎలాంటి ఫిల్టర్ లేకుండా, ఎవరికీ భయపడకుండా చాలా బోల్డ్ గా చెప్పేస్తూ ఉంటుంది. ఒకానొక సమయం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈమెకి పెద్ద గొడవ కూడా సోషల్ మీడియా లో జరిగింది.

40 ఏళ్ళ వయస్సు ఉన్న ఈమె ఇప్పటికీ యంగ్ గా కనిపించడం విశేషం. ఇకపోతే రీసెంట్ గానే ఆమె బాలీవుడ్ లో సఫేద్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కాబోతుండడం తో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నది.

అందులో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె తన పెళ్ళికి సంబంధించిన వార్త గురించి పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘ఇంట్లో నా పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు మొదలు అయ్యాయి. ఫిబ్రవరి నెలలో చెయ్యాలని చూస్తున్నారు.

రాజస్థాన్ లో అట్టహాసం గా నా పెళ్లి జరగబోతుంది. సుమారుగా 150 మంది అతిథులను ఆహ్వానించాం, బాలీవుడ్ నటీనటులతో పాటుగా టాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు కూడా నా పెళ్ళికి రాబోతున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది మీరా చోప్రా.

టాలీవుడ్ లో ఆమె పవన్ కళ్యాణ్ తర్వాత నితిన్ తో మాత్రమే సినిమా చేసింది. ఆ తర్వాత తమిళం లో ఒకటి రెండు సినిమాలు చేసింది. పవన్ కళ్యాణ్ తో తప్ప మిగతా వాళ్ళతో ఈమెకి పెద్దగా పరిచయం లేదు.

అంటే ఈ పెళ్ళికి ఆమె పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించిందా అని అనుకుంటున్నారు నెటిజెన్స్. ఇక పెళ్లి కొడుకు ఎవరు ఏమిటి అనే విషయం మాత్రం ఇంకా బయటపెట్టలేదు మీరా చోప్రా.