హీరో ధనుష్ తో రెండవ పెళ్లి పై మీనా సంచలన కామెంట్స్!

0
432
Meena sensational comments on second marriage with hero Dhanush

ఈమధ్య కాలం లో సోషల్ మీడియా ప్రభావం వల్ల సెలెబ్రటీలు ఎన్నో ఇబ్బందులను ఎదురుకుంటున్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తమ జీవితాలను తాము చూసుకుంటున్నప్పటికీ సెలబ్రిటీస్ ని కొంత మంది గాసిప్పు రాయుళ్లు ఇష్టమొచ్చిన రాతలతో వాళ్ళ కుటుంబాన్ని బాధపెడుతూ నడిరోడ్డు మీదకు లాగుతున్నారు.

ఒకానొక దశలో సెలబ్రిటీ గా పుట్టడమే మేము చేసుకున్న పాపం అని అనిపించేలా చేస్తున్నారు. రేటింగ్స్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి కదా అని, సెలబ్రిటీస్ ని కనీసం మనుషులు లాగ కూడా చూడడం లేదు కొంతమంది దుర్మార్గులు. అలాంటి వారి పై సీనియర్ హీరోయిన్ మీనా చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

Meena sensational comments on second marriage with hero Dhanush

మళ్లీ పెళ్లి చేసుకోను.. జీవితాంతం ఒంటరిగా ఉండను

ఈమె గత కొంత కాలం నుండి ప్రముఖ కోలీవుడ్ యంగ్ హీరో ధనుష్ తో ప్రేమాయణం నడుపుతుందని, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని , త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, ఇలా రకరకాల వార్తలు ప్రచారం అవుతూ వచ్చాయి.

మీనా భర్త విద్య సాగర్ కొంతకాలం క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఇది అందరికీ తెలిసిందే, అలాగే ధనుష్ కూడా తన సతీమణి ఐశ్వర్య కి విడాకులు ఇచ్చేసాడు.

ఇద్దరు ప్రస్తుతం సింగిల్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధం అంటగట్టేసారు సోషల్ మీడియా లో ఉన్న గాసిప్ రాయుళ్లు. కనీసం ఒకే వయస్సు ఉన్న వారికి లింక్ పెట్టినా ఒక్క అర్థం ఉంది. మీనా వయస్సు 47 ఏళ్ళు, అలాగే ధనుష్ వయస్సు కేవలం 39 ఏళ్ళు మాత్రమే.

ఇద్దరి మధ్య దాదాపుగా 8 ఏళ్ళ గ్యాప్ ఉంది. ఇంత గ్యాప్ ఉన్న వారికి సంబంధం అంటగట్టాలనే ఆలోచన ఎవడికి వచ్చిందో కానీ, వాడు మామూలోడు కాదు.

అయితే ఈ వార్తపై మీనా రీసెంట్ ఇంటర్వ్యూ లో స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘ఒకసారి నేను ధనుష్ గారిని కలిసినప్పుడు సెల్ఫీ తీసుకున్నాను, దానిని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాను. కొంతమంది ఆ ఫోటోని చూసి మా ఇద్దరికీ మధ్య లింక్ ఉన్నట్టు కథనాలు రాసుకొచ్చారు.

ఈ వార్త అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. విషయం మా కుటుంబం దాకా వచ్చింది. వాళ్ళు ఈ వార్తలు చూసి చాలా బాధపడ్డారు. వాళ్ళని చూసి నేను కూడా బాధపడ్డాను.

ఇంతమందిని బాధపెట్టడానికి కొంచెం కూడా మనసు లేదా, ధనుష్ ని నేను కేవలం రెండు సార్లు మాత్రమే కలిసాను, అతను నన్ను అక్కా అని పిలుస్తాడు’ అంటూ మీనా ఈ సందర్భంగా గాసిప్ రాయుళ్ల పై విరుచుకుపడింది.