‘గుంటూరు కారం’ సెన్సార్ టాక్ వచ్చేసింది..సంక్రాంతి కి వార్ వన్ సైడ్ అయిపోయింది!

0
271
Guntur Karam censor talk has arrived War for Sankranti is one sided

మరో ఆరు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.

త్రివిక్రమ్ మరియు మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడం తో ఈ మూవీ పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.

దానికి తోడు టీజర్ మరియు పాటలు పెద్ద హిట్ అవ్వడం తో ఆ అంచనాలు పదింతలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమాలో మహేష్ బాబు ని ఇంత వరకు ఎవ్వరూ చూపించని రేంజ్ మాస్ అవతారం లో చూపించే ప్రయత్నం చేసాడు త్రివిక్రమ్.

మహేష్ బాబు లో కంప్లీట్ చేంజ్ వచ్చింది త్రివిక్రమ్ తో చేసిన ‘ఖలేజా’ చిత్రం తర్వాతే. ఆ సినిమా మహేష్ కెరీర్ ని ఎలా అయితే మలుపు తిప్పిందో, ‘గుంటూరు కారం’ చిత్రం కూడా ఆ విధంగా మలుపు తిప్పుతుందని అంటున్నారు మూవీ టీం.

ఇకపోతే ఈరోజు జరగాల్సిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కొన్ని అనివార్య కార్యక్రమాల వాళ్ళ వాయిదా పడింది. కొత్త డేట్ ని అతి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు మేకర్స్.

నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికెట్ ని జారీ చేసారు.

ఈ సినిమాకి వాళ్ళ నుండి వచ్చిన రిపోర్ట్స్ మరియు ప్రశంసలు ఈమధ్య కాలం లో ఏ సినిమాకి కూడా రాలేదని అంటున్నారు ఇండస్ట్రీ కి సంబంధించిన కొంతమంది ముఖ్యులు.

For Sankranti Guntur Karam has been booked without leaving a single theater

సంక్రాంతికి ఆడియన్స్ ఎలాంటి సినిమాని అయితే కోరుకుంటారో, అలాంటి సినిమాని అందించింది ఈ కాంబినేషన్. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే నాలుగు యాక్షన్ బ్లాక్స్ మహేష్ ఫ్యాన్స్ కి పండగ చేసుకునేలా చేస్తుందట.

ఇలాంటి మాస్ సన్నివేశాలు రీసెంట్ టైం లో మేము చూడలేదని సెన్సార్ సభ్యులు మూవీ టీం తో అన్నారట. అలాగే మహేష్ ని ఇంత ఎనర్జీ గా చూసి చాలా కాలం అయ్యిందని, త్రివిక్రమ్ డైలాగ్స్ అదిరిపోయాయి అని అంటున్నారు.

అంతే కాకుండా చివరి 20 నిమిషాలు ఎమోషన్స్ చాలా చక్కగా కుదిరాయని, అత్తారింటికి దారేది సినిమా తర్వాత త్రివిక్రమ్ కెరీర్ లో ‘గుంటూరు కారం’ క్లైమాక్స్ లో బాగా ఎమోషనల్ కి గురి చేసిందని అంటున్నారు.

ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్ మరియు రమ్య కృష్ణ మహేష్ బాబు కి తల్లితండ్రులుగా నటించారట.