సంచలన విషయాలు బయటపెట్టిన పవిత్ర లోకేష్

0
985

పవిత్ర లోకేష్ కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కు వచ్చింది. ఇటీవల ఏ వార్తలో చూసినా ఈమె ప్రధానంగా నిలుస్తుంది. దానికి కారణం సీనియర్ హీరో నరేశ్. సీనియర్ హీరో నరేశ్ పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ వర్గాలు విపరీతంగా ఈ న్యూస్ నే వింటున్నాయి. గతంలో బెంగళూరులో ఒక హోటల్ గదిలో నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

పవిత్ర లోకేష్, నరేశ్ క్లారిటీ

ఈ సందర్భంగా సెల్ ఫోన్ లో చిత్రించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అప్పట్లో టాలీవుడ్ ఇండస్ర్టీలో దుమారమే రేగింది. దీనిపై పవిత్ర లోకేష్, నరేశ్ కూడా క్లారిటీ ఇచ్చారు. సహజీవనం మాట వాస్తవమేనని చెప్పారు. ఇక ఇటీవల నరేశ్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు కూడా నరేష్ తో కలిసి పవిత్ర లోకేష్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వీటిపై నెటిజన్లు తీవ్రంగా కామెంట్ల వర్షం కురిపించారు.

పోలీసులను సైతం ఆశ్రయించిన పవిత్ర

రీసెంట్ గా పవిత్ర లోకేష్ తనపై వస్తున్న కామెంట్లపై పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో సైబర్ పోలీసులకు ఈ మేరకు ఆమె ఒక ఫిర్యాదు కూడా చేసింది. కొంత మంది యూట్యూబర్స్ కావాలనే తన పరువును తీస్తున్నారని చెప్పుకొచ్చింది. దీని అంతటికీ కారణం రమ్య రఘుపతి అంటూ ఫిర్యాదులో కూడా పేర్కొంది.

ఆమెపై సదరు యూట్యూబర్స్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంది. తను, నరేశ్ ఫొటోలను థంబ్ నేయిల్స్ గా పెట్టి గాసిప్ లు క్రియేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవిత్రీ లోకేశ్ ఒక బాంబు పేల్చింది. ఒక స్టార్ హీరో తనను వాడుకొని వదిలేసాడంటూ చెప్పింది.

అవకాశం అడిగితే అదే కోరేవారు

కర్ణాటక నుంచి వచ్చిన పవిత్ర లోకేష్ నటన విషయంలో మొదట్లో అంతగా రాణించలేదు. తర్వాత కొంత గ్యాప్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ గుర్తింపు సంపాదించుకుంది. గతంలో కన్నడ ఇండస్ట్రీలో కూడా నెగెటివ్ రోల్స్ లో కనిపించింది కాబట్టి ఆమెకు అక్కడ కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. వెండితెరకు వచ్చిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడ్డానని ఇటీవల ఓ కన్నడ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

నటన చూసి ఆఫర్లు ఇచ్చేవారు కాదట

అవకాశాల కోసం కొందరి వద్దకు వెళ్తే వారు ఏం కోరికలు అడుగుతారో అందరికీ తెలిసిందే అంటూ చెప్పింది. వాటి గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుందని చెప్పుకచ్చింది. తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న కష్టాలు ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. తన నటన చూసి ఆఫర్లు ఇచ్చేవారు కాదని, తన నుంచి వారు ఏమి కోరుకుంటున్నారో అని ఆలోచిస్తేనే భయం వేసేదని చెప్పుకొచ్చింది.

ఆ స్టార్ హీరో వాడుకొని వదిలేశాడు

సినిమా అవకాశాలపై వారి దగ్గరికి వెళ్లినప్పుడు అవకాశం కావాలన్నప్పుడు వారు కూడా తమ నుంచి ఏమి కోరుకుంటారు. లైంగిక కోరికలే అది అందరికీ తెలిసిందే అంటూ చెప్పింది. ఈ క్రమంలోనే అవకాశాల పేరిట ఒక తమిళ్ స్టార్ తనను బాగా వాడుకొని వదిలేసాడని, ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తుంటాను కాబట్టి ఎవరూ లైంగికంగా వేధించడం లేదని చెప్పింది. పవిత్ర లోకేష్ ఇండస్ట్రీలో ఈ బంబ్ పేల్చడంతో ఆ పాపులర్ హీరో ఎవరు అనే విషయంపై సర్వత్ర చర్చలు మొదలయ్యాయి. కోలీవుడ్ ఇండస్ర్టీతో పవిత్రతో ఎక్కువ కాలం కలిసి ఉన్న యాక్టర్ ఎవరనే కోణంలో సెర్చ్ మొదలు పెట్టారు నెటిజన్లు.