పెళ్లికి ముందే అది చేయమన్న నరేశ్..!

0
388

ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వైరల్ అవుతున్న పేర్లు సీనియర్ నరేశ్-పవిత్రా లోకేశ్. దాదాపు ఏడాది నుంచి సహజీవనం చేస్తున్న వీరు చాలా విమర్శలను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి కూడా చాలా హడావుడి చేస్తుంది. కొన్ని ఛానెళ్లు, వెబ్ సైట్లు ప్రచురిస్తున్న కథనాలపై నరేశ్-పవిత్రా సైబర్ పోలీసులను కూడా ఆశ్రయించారు.

నరేశ్ గురించి, వారి దాంపత్యం గురించి పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ మరిన్ని వివాదాలను రాజేస్తుంది. తనకు విడాకులు ఇవ్వకుండానే నరేశ్ మరొకరితో ఎలా సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఎలా ప్రకటిస్తాడు..? అంటూ ప్రశ్నిస్తుంది. గతంలో ఒక హోటల్ లో ఆమె నరేశ్-పవిత్రను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రమ్య రఘుపతి వీరిపై చెప్పుతో దాడి చేసేందుకు కూడా ప్రయత్నించింది.

లిప్ లాక్ పై స్పందించిన రమ్య రఘుపతి

ఇవి జరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్ 31న నరేశ్-పవిత్రా లోకేశ్ లిప్ లాక్ వీడియో మరో సంచలనం సృష్టించింది. న్యూ ఇయర్ లో తమ కొత్త జర్నీ స్ట్రాట్ కాబోతుందని. ఈ లిప్ లాకే అందుకు ఉదాహరణ అంటూ ‘మళ్లీపెళ్లి’ అని రిలీజ్ చేసిన ఈ వీడియో అప్పట్లో చాలా వ్యూవ్స్ తో వివాదాలకు కారణమైంది. ఇదంతా ఒక సినిమా ప్రమోషన్ కోసం తీసిందని తర్వాత చెప్పుకచ్చే ప్రయత్నం చేశారు పవిత్రా లోకేశ్-నరేశ్ ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం రమ్య రఘుపతి నరేశ్ గురించి చెప్పే విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయన తనతో ప్రవర్తించిన తీరు, ఆయన పెళ్లి గురించి, తన జీవితం ఆయనతో ఎలా ముడిపడిందని ఇప్పుడు ఇవి నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు.

చాలా విషయాలు దాచి నరేశ్ పెళ్లి చేసుకున్నాడు

‘నరేశ్ తనకంటే దాదాపు 20 సంవత్సరాలు పెద్దవాడు. పెళ్లికి ముందు వయస్సు దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు. కేవలం 12 సంవత్సరాలని చెప్పి మోసం చేశాడు. ముందుగా పెళ్లి వద్దని కొన్ని రోజులు సహజీవనం చేద్దామని చెప్పాడు. ఒక వేళ దీనికి పెద్దలు ఒప్పుకోకుంటే లేచిపోదాం అని కూడా చెప్పాడు. కానీ నేను ఆయన మాటలను పట్టించుకోలేదు. ఒక సందర్భంలో ఆయన తనను పెళ్లి చేసుకోకుంటే చాలా మిస్ అవుతాను అన్నాడు. ఆ మాటతో పడిపోయా. ఆ తర్వాత అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను.

వేణు స్వామి కూడా వద్దన్నాడు

పెళ్లికి ముందే వేణు స్వామికి మా ఇద్దరి జాతకాలను చూపిస్తే ఆయన ఇద్దరికీ పెళ్లి జీవితం అచ్చిరాదని చెప్పాడు. అప్పుడు ఆయన మాటలను వినకుండా పెళ్లి చేసుకున్నా. తర్వాతే నరేశ్ గురించి ఒక్కొక్కటిగా తెలిశాయి. వివాహం జరిగిన ఏడాదికే బాబు పెట్టాడు. దాదాపు ఏడాదిన్నర నుంచి నరేశ్ పవిత్రను పెళ్లి చేసుకుంటానని నన్ను టార్చర్ చేయడం మొదలు పెట్టాడు.

నా క్యారెక్టర్ ను బ్యాడ్ చేసేందుకు చాలా మందితో అక్రమ సంబంధం అంట గట్టాడు. మా మామ కృష్ణ గారితో కూడా అంటే నరేశ్ గురించి అర్థమయ్యే ఉంటుంది. ఏది ఏమైనా నరేశ్ కు విడాకులు ఇవ్వను. ఆయన పవిత్రను పెళ్లి చేసుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించను.’ రీసెంట్ గా రమ్య చెప్పిన మాటలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.