సలార్ పార్ట్ 2 అప్పుడే.. చెప్పేసిన ప్రభాస్

0
330

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తగా విడుదల అయిన చిత్రం సలార్. ఈ చిత్రం డిసెంబర్ 22 న విడుదల కాగా..

విడుదల అయిన తోలి రోజు నుండి మిక్సడ్ టాక్ వచ్చింది. బాహుబలి తరువాత హిట్ లేక అల్లాడి పోతున్న ప్రభాస్ కి ఒకింత ఊరటని ఇచ్చిందని మాత్రం చెప్పవచ్చు.

అంతకి మించి పెద్ద విజయం సాధించలేదని కలెక్షన్ లని బట్టి చెప్పవచ్చు. విడుదల అయిన తోలి ఆరు రోజుల్లోనే 500 కోట్లు వసూళ్లు చేసినా కూడా..

ఆ తరువాత డీలా పడ్డాయి. నిజానికి సాలార్ సినిమాకి తోలి రోజుల్లో వచ్చిన మంచి హైప్ కారణంగా వసూళ్లు బాగా సాధించింది.

కానీ ఆ తరువాత మొత్తానికే డ్రాప్ అవ్వడంతో చిత్ర యూనిట్ నిరాశలో ఉంది. 1000 కోట్లు వసూళ్లు ఖాయమని అనుకున్నా..

దాని దరిదాపుల్లోకి వెళ్లాలా కూడా కనిపించడం లేదు. ఈ విషయాన్ని కొందరు మీడియా ప్రతినిధులు దర్శకుడు ప్రశాంత్ నీల్ వద్ద ప్రస్తావించారు.

Salaar part 2 is about to start shocking news for Prabhas fans

దీనితో ప్రశాంత్ నీల్ ఈ విషయం పై స్పందించారు. సాలార్ పై వస్తున్న కామెంట్లు తాను విన్నానని చెప్పారు. అయితే అందులో వాస్తవం లేకపోలేదని..

కానీ అసలు కథ పార్ట్ 2 లో ఉంటుందని అన్నారు. శౌర్యాంగ పర్వానికి ఈ భాగం జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే అని అన్నారు.

అసలు కథ అంతా శౌర్యాంగ పర్వంలోనే ఉంటుందని చెప్పారు. అది పార్ట్ 2 లో విపులంగా.. అందరికీ అర్ధం అయ్యేలా ఉంటుందని దర్శకుడు వివరణ ఇచ్చారు.

ప్రశాంత్ నీల్ చెప్పిన వ్యాఖ్యలతో అభిమానుల్లో అప్పుడే పార్ట్ 2 పై అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ప్రభాస్ కూడా పార్ట్ 2 విడుదల పై క్లారిటీ ఇచ్చారు.

పార్ట్ 2 షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుందని.. అది కూడా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తామని అన్నారు. దీనితో సాలార్ పార్ట్ 2 సినిమా 2024 లో వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతుంది.