ఆ వ్యాపార వేత్తతో శ్రీముఖి ఎఫైర్.. త్వరలోనే పెళ్లి

0
1142

యాంకర్ శ్రీముఖి గురించి బుల్లితెరకు పరిచయమే అవసరం లేదు. బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనతికాలంలోనే స్టార్ యాంకర్ల సరసన చేరారు. అనేక షోలు, ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. అదుర్స్, సూపర్ సింగర్ 9 ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘జులాయి’ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో నటించారు. ఇదే ఆమెకు మొదటి సినిమా. ఆ తర్వాత సినిమాల్లో సహనటిగా ఆమె చేస్తూ వస్తున్నారు.

వెండితెరపై బోల్తాపడిన ముద్దుగుమ్మ

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ధనలక్ష్మి తలుపుతడితే, ప్రేమ ఇష్క్ కాదల్, నేను శైలజ, జెంటిల్ మెన్ తదితర చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది శ్రీముఖి. ఇన్ని సినిమాల్లో క్యారెక్టర్లు వేసినా వెండితెరపై పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. కానీ యాంకర్ గా మాత్రం బుల్లితెరపై స్టార్ డమ్ నిలబెట్టుకుంటూ వస్తుంది. ఎక్కువగా వెకేషన్ లను ఎంజాయ్ చేసే శ్రీముఖి గ్లామర్ చూపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. ఆమె వెకేషన్ లలో పెట్టిన హాట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయనడంతో సందేహం లేదు.

టీవీ షోలలో మంచి పంచ్ లు, కామెడీ ట్రాక్ ను బాగా పండించే శ్రీముఖి గ్లామర్ తో ప్రేక్షకులను తనవైపు మళ్లించుకోవడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఈ అమ్మడి లవ్ ట్రాక్ గురించి అప్పట్లో చాలానే గాసిప్స్ వచ్చాయి. కొ యాంకర్ ప్రదీప్ తో కొన్ని రోజులు ప్రేమాయణం నడిపించిందని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ప్రదీప్ శ్రీముఖి వివాహం చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా బాగా వ్యాపించాయి. అయితే తర్వాత వాటిని వారు కొట్టిపారేశారు.

స్టార్ ప్రొడ్యూసర్ ప్రపోజల్ తిరస్కరించిన శ్రీముఖి

ఇటీవల శ్రీముఖిని ఒక స్టార్ ప్రొడ్యూసర్ తన కొడుకు వరుస అయిన వ్యక్తితో పెళ్లి చేయాలని అనుకున్నాడు. ఈ విషయంపై శ్రీముఖి తండ్రిని కూడా ఆయన సంప్రదించారట. కానీ పెళ్లి తన కూతురు ఇష్టమని ఆమె తండ్రి చెప్పడంతో ఆమె కూడా దీనికి నో చెప్పినట్లు తెలిసింది. ఆమె ఎవరితోనో లవ్ లో ఉండడంతోనే ఇలాంటి డిషిజన్ తీసుకుందని అప్పట్లో బాగా వైరల్ కూడా అయ్యింది. అంతపెద్ద స్టార్ ప్రొడ్యూసర్ ప్రపోజల్ కే నో చెప్పిందంటే వీరి ప్రేమ స్ట్రాంగ్ అంటూ కూడా పుకార్లు వచ్చాయి.

డేట్ మాత్రమే మిగిలింది

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు త్వరలోనే శ్రీముఖి పెళ్లిపీటలు ఎక్కనుందట. కొన్ని రోజుల నుంచి ఒక వ్యాపారవేత్తతో సీక్రెట్ లవ్ ట్రాక్ నడుపుతున్న చిన్నది త్వరలో ఏడడుగులు వేయనుందట. ఈ మేరకు ఇరు తరుపు పెద్దలు మాటలు కూడా మాట్లాడుకున్నారట. ఇక పెళ్లి ముహూర్తం పెట్టడం మాత్రమే మిగిలిందని తెలుస్తుంది. శ్రీముఖి కూడా తన అభిమానులకు, టీవీ కుటుంబానికి త్వరలోనే తీపి కబురు చెప్పనున్నారట. అంటే వచ్చే పెళ్లి ముహూర్తాలలో బుల్లితెర రాములమ్మను వధువుగా చూస్తామన్నమాట.