సీఎం ఎనర్జీ డ్రింక్ ను లీక్ చేసిన రోజా

0
418

ప్రముఖులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో వారికి సూచించిన డైట్ ప్రకారమే ఉంటుంది. న్యూట్రీషియన్స్ మెనూ ప్రకారమే వీఐపీలు, వీవీఐపీలు ఉండడం సహజమే కానీ కొందరి డైట్ వారి ఇష్టాలకు లోబడి కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట సీఎం జగన్ మోహన్ రెడ్డి డైట్ పై మంత్రి నగరి ఎమ్మెల్యే రోజా ఇటీవల కొన్న విషయాలను లీక్ చేశారు. ఆయన డైట్ ఎలా ఉంటుంది. ఏ ఆహార పదార్థాలు ఆయనకు ఇష్టమో చెప్పారు.

ఇంటర్వ్యూలో జగన్ ఫుడ్ పై స్పందించిన రోజా

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సీఎం ఫుడ్ మెనూపై క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ ఎప్పుడూ ఫిట్ గా ఉంటారు. కరోనా సమయంలో కూడా ఆయన ఎలాంటి అనారోగ్యానికి గురవ్వలేదు. ఆయన ఎప్పుడూ అలా ఉండేందుకు కారణం ఆయన తీసుకునే డైటే.. అంటూ చెప్పుకచ్చారు ఏపీ టూరిజం మంత్రి రోజా. సార్ లా తింటే మనం కూడా జీరో సైజుకు పడిపోతామంటూ కామెంట్లు కూడా చేసింది. ఆయన తినే విధానం కూడా చాలా ముచ్చటగా ఉంటుందని చెప్పింది.

నగరిలో పరిశీలించిన రోజా

అప్పట్లో తెలుగు దేశం పాలనలో జగన్ పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా నగరికి వచ్చారు. అక్కడ ఆయనకు రోజా ఆతిధ్యం ఇచ్చారు. ఆయన ఫుడ్ మెనూను ఆమెనే దగ్గరుండి చూసుకున్నారు. ఆ విషయాలను వివరించారు. సీఎం ఫుడ్ లో పుల్కాతో పాటు బాయిల్డ్ వెజిటేబుల్స్ మాత్రమే ఉంటాయి. ఎక్కువగా ఆయన నాన్ వెజ్ ను ఇష్ట పడరు. అలా అని తినకుండా ఉండరు. వారానికి ఒకసారి మాత్రమే నాన్ వెజ్ ను తింటారు. రాయలసీమ చిత్రాన్నం, మామిడి తురుము పులిహోర అంటే ఇష్టంగా తింటారు అని చెప్పింది. ఇక పల్లీలు, మొక్కజొన్న పొత్తులు, ఫ్రూట్ జ్యూస్ అయితే రెగ్యులర్ ఉంటాయని చెప్పింది.

వైఎస్ జగన్ హెల్దీ డ్రింక్

ఇక ఆయన హెల్దీ డ్రింక్ గురించి కూడా వివరించారు రోజా.. ప్రతి రోజూ పచ్చి అల్లంతో కూడిన లీటరు పాలను మరిగించి ఒక గ్లాసుగా తీసుకుంటారని చెప్పింది. ఇందులో అనేక ఔషద గుణాలుంటాయి. ఇది చాలా మంచి డ్రింక్ అందుకే ఆయన ఎప్పటికీ యంగ్ గా కనిపిస్తారు. దీంతో పాటు మంచి ఎనర్జీతో ఉంటారు. అంటూ చెప్పుకచ్చింది.

నెటిజన్స్ కామెంట్స్

రోజా మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. వైఎస్ జగన్ ఫ్యాన్స్, రోజా అభిమానులు మంచి కామెంట్లు పెడుతున్నారు. తాము కూడా రెగ్యులర్ గా తీసుకుంటామని చెప్తుండడం గమనార్హం. ఈ విషయాలు చెప్పినందుకు రోజాకు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు నెటిజన్లు.