‘బెడ్ పై బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్’ పై రేష్మ క్లారిటీ

0
411

గాసిప్ లు, వివాదాలు స్టార్లకు కొత్తేమి కాదు. ఇండస్ట్రీలోకి వచ్చి మంచి పాపులారిటీ సాధిస్తున్నారన్న సమయంలో చాలా కష్టాలను ఫేస్ చేయాల్సి వస్తుంది. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తే.. సక్సెస్ సాధిస్తారు. వాటి కారణంగానే కొందరు ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిన వారు కూడా లేకపోలేదు. టెక్నాలజీ అడ్వాన్స్ అవుతూ కొందరిని సమస్యల్లోకి నెడుతుందనేందుకు రేష్మ పసుపులేటి ఉదతం వివరిస్తుంది.

ఆమె ఒక వివాదంలో ఇరుక్కొని చాలా రోజులు డీప్రెషన్‌కు వెళ్లిన సందర్భంగా ఒకటి ఆమె లైఫ్ లో జరిగింది. ఇటీవల ఆ విషయాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. తనకు సబంధం లేని వీడియోను తన పేరుపై పోస్ట్ చేసి తనను కొందరు చాలా ఇబ్బందుల్లోకి నెట్టారని చెప్పుకచ్చింది.

వీడియోపై రేష్మ క్లారిటీ

తమిళంలో మంచి యాంకర్ గా అనతి కాలంలోనే గుర్తింపు సంపాదించుకుంది రేష్మ పసుపులేటి. యాంకరింగ్ తో పాటు షోలలో హోస్ట్ గా చేస్తూ, ప్రస్తుతం వెండితెరపై కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది ఈ అమ్మడు. అప్పట్లో సింగర్ సుచిత్ర ‘సుచీ లీక్స్’ పేరుతో సెలబ్రెటీల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా నటి, యాంకర్ అయిన రేష్మ పసుపులేటిపై కూడా ఒక వీడియో లీక్ చేసింది. ‘హీరోయిన్ బెడ్ పై బాయ్ ఫ్రెండ్ తో’ అని సోషల్ మీడియాలో వదిలింది. ఇది అప్పట్లో కోలివుడ్ లో సంచలనమే రేపింది. అయితే దీనిపై ఇటీవల రేష్మ స్పందించింది. ఆమె మాటల్లోనే విందాం..

వీడియోను మార్ఫింగ్ చేశారు

‘ఈ వీడియోలో బెడ్ పై ఉన్నది తను కాదంటూ ఆమె చెప్పుకచ్చింది. వీడియో రిలీజ్ అయిన కొద్ది సేపటికే లక్షలాది వ్యూవ్స్ వచ్చాయి. అసలు ఆమె ఇలాంటి మార్ఫింగ్ వీడియో ఎందుకు రిలీజ్ చేసిందో తెలియదు. దీనిపై నా చెల్లి నాకు ఫోన్ చేసి బాగా ఏడ్చింది. మా ఫ్యామిలీ కూడా చాలా కష్టాలు పడింది. మొదట ఈ వీడియో గురించి నా చెల్లే నాకు చెప్పింది. కాని దాన్ని పరిశీలిస్తే తెలిసింది అది పూర్తిగా మార్ఫింగ్ చేసిందని.

వీడియో లీక్ చేసిన సమయంలో అంతెందుకు ఇప్పటికీ కూడా నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. అందులో ఉంది ఎవరు..? ఇప్పటి వరకూ సుచి క్లారిటీ ఇవ్వలేదు. ఆ మార్ఫింగ్ వీడియోను చూపిస్తూ చాలా మంది నన్ను బెదిరించారు కూడా. చాలా రోజులు డీప్రెషన్ లోకి వెళ్లాను. తర్వాత అనిపించింది నేను చేయని తప్పుకు ఇలా బాధపడడం కరెక్ట్ కాదని అందుకే త్వరగానే బయటపడ్డా. ఇలాంటి పనులు చేసేప్పుడు కొంచెం వారి గురించి కూడా ఆలోచించాలి.’ అంటూ చెప్పుకచ్చింది.

ధైర్యంగా ఎదుర్కోవాలన్న రేష్మ

కోలివుడ్ లో అనతి కాలంలోనే గుర్తింపు సంపాదించుకున్న రేష్మ పసుపులేటి. వెండితెరపై మంచి ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఆమె సీరియల్స్ తోనే చాలా మంది అభిమానులను ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు వెండితెరపై కూడా ఆమెకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్వతహాగా కష్టపడే నైజం రేష్మది. ఎంచుకున్న రంగంలో రాణించి మరింత గుర్తింపు పొందాలని కలలు కంటుంది. ఇలాంటి వాటితో ఎవరూ సఫర్ కావద్దని స్టార్ గా గుర్తింపు వచ్చిన తర్వాత ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని చెప్పుకచ్చింది. వీటిని ధైర్యంగా ఎదుర్కోవాలని కూడా సూచించింది.