విడుదలకు ముందే హిట్‌ అయిన సినిమా నాది

0
228
The movie was a hit before its release
The movie was a hit before its release

బాక్సులు బద్ధలైతే గానీ తెలియదు సినిమాల భవితవ్యం అయినా.. రాజకీయ నాయకుడి భవితవ్యం అయినా. అయితే ఇందుకు కొన్ని సినిమాలు.. కొందరు నాయకులకు మినహాయింపు ఉంది.

ఎందుకంటే రిజల్ట్స్‌కు ముందే వాటిపై ఓ అంచనా ఏర్పడుతుంది. దీంతో ఫలానా సినిమా ఖచ్చితంగా హిట్టు అని, ఫలానా నాయకుడు ఖచ్చితంగా గెలుస్తాడు అని గెస్‌ చేయవచ్చు.

అలా విడుదలకు ముందే హిట్‌ సినిమా నాది అంటున్నాడు సూపర్‌ నేచురల్‌ హీరో తేజ సజ్జా. సంక్రాంతికి వచ్చిన ‘హను`మాన్‌’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో హ్యాపీగా ఉన్న తేజ మీడియాతో మాట్లాడుతూ…

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గానే స్టార్‌డమ్‌ను చూసిన వ్యక్తిని నేను. కాబట్టి సినిమా అన్నా.. ఆ వాతావరణం అన్నా భయంలేదు. ఓ బేబీ, జాంబిరెడ్డి రెండు సినిమాలు ఫాంటసీకి, సూపర్‌ నేచురల్‌కు సంబంధించిన సబ్జెక్ట్స్‌.

మళ్లీ మూడో సినిమా ‘హను`మాన్‌’ కూడా అదే కోవకు చెందింది కదా అని కొంత ఆలోచనలో పడ్డాను. అయితే దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఈ సబ్జెక్ట్‌కు నువ్వే టైలర్‌మేడ్‌.

ఇది స్టార్‌ హీరో చేసే సబ్జెక్ట్‌ కాదు.. హీరోను స్టార్‌ను చేసే సబ్జెక్ట్‌. ఖచ్చితంగా సూపర్‌హిట్‌ అవుతుంది అని ధైర్యం చెప్పారు.

ఇక్కడ ప్రేక్షకులు నచ్చింది చేస్తేనే సక్సెస్‌ వస్తుంది. మనకు నచ్చింది చేస్తే రాదు. అన్ని రకాల పాత్రలు చేయాలనే కోరిక నాది. మరోవైపు స్టార్‌ అనిపించుకోవాలని కూడా ఉంది. తారక్‌ అన్నయ్య సూచన మేరకు క్లాసిక్‌, చిరంజీవి గారి సూచన మేరకు వెస్ట్రన్‌ నేర్చుకున్నా.

Will my wish come true Chiru Dasari request
Will my wish come true Chiru Dasari request

అలాగే హార్స్‌రైడిరగ్‌, కరాటే ఇలా హీరోగా నిలబడటానికి కావాల్సిన మెటీరియల్‌గా నా బాడీని, బ్రెయిన్‌ను మలుచుకుంటూ వస్తున్నా. అమ్మా, నాన్నా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా బాగా ఎంకరేజ్‌ చేశారు.

బీబీఏ పూర్తి కాగానే ఇక మంచి జాబ్‌ చూసుకోమన్నారు. నేను సినిమాల మీదే దృష్టి పెట్టాను. ప్రారంభంలో కెరీర్‌ ఆశించిన విధంగా లేకపోయినప్పటికీ, ఓబేబీ, జాంబిరెడ్డిల విజయంతో అమ్మా, నాన్న హ్యాపీగా ఫీలయ్యారు.

ఇప్పుడు ‘హను`మాన్‌’తో ఇక వారి సంతోషానికి హద్దేలేదు. నాకు కథ నచ్చకపోతే ముందే చెప్పేస్తా. అంతేగానీ ఒక్కసారి ఒప్పుకున్నాక దాంట్లో కాళ్లు, వేళ్లు పెట్టను.

లొకేషన్‌లో ఏవైనా ఐడియాలు వస్తే యూనిట్‌తో పంచుకుంటాను అంతే. అది ఇంప్లిమెంట్‌ అనేది డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ చేతుల్లో ఉంటుంది. కొద్ది రోజుల్లో ‘హను`మాన్‌`2’ ప్రారంభం అవుతుంది. అలాగే ఓ పెద్ద డైరెక్టర్‌తో సినిమా ఉంది. వివరాలు తర్వాత చెపుతాను అన్నారు.