నదియా ఇంటర్ లవ్ ఎఫైర్.. ఎవరితో తెలుసా..?

0
656

సీనియర్ నటి నదియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం అత్త పాత్రలతో పాటు కో ఆర్టిస్టుగా పని చేస్తున్న నదియా గతంలో హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలలో నటించారు. కానీ ఆ సినిమాల గురించి ఎవరికీ తెలియదు. తక్కువ వయస్సులో ఉన్నా తన కంటే పెద్ద వయస్సు స్టార్స్ కు అత్త, అక్క, తదితర రోల్స్ లో నటించి మెప్పించారు ఆమె. మళమాల సినిమాతో అక్కడి ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె మొదటి చిత్రం హిట్ సాధించింది. తర్వాత మంచి అవకాశాలతో దూసుకెళ్లారు ఆమె. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మెప్పించారు.

తల్లి, అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ ఆమె

ఆమె చిత్రాల గురించి చెప్తే ముందు వరుసలో ఉంటుంది ‘అత్తారింటికి దారేది’. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కు అత్తగా నటించిన నదియా అవార్డులు కూడా అందుకున్నారు. తర్వాత ‘అఆ’లో సమంత తల్లిగా నటించిన ఆమె ధీటగా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. వీటితో పాటు మరిన్ని చిత్రాల్లో కూడా నటించారు. ఆమెకు కూడా లవ్ స్టోరీ ఉంది. కానీ అది వన్ సైడ్ లవ్వనే చెప్పాలి. ఎవరితోనంటే

ఇంటర్ లో ఇంటి ముందు ఉన్న శిరీష్ తో ప్రేమాయణం

ఆమె ఇంటర్ చదువుతున్న సమయంలో తన ఇంటి ఎదురుగా ఉన్న శిరీష్ గాడ్బోలే తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అతనితో రాను రాను అది సిరియస్ గా కూడా మారిందట. ఒక సందర్భంలో నువ్వు లేకుంటే అని చెప్పడంతో ఆయన కూడా సున్నితంగా తిరస్కరించాడట. ఎందుకంటే అప్పటి వరకూ ఆయనకు చదవు అంటే అంత పిచ్చి ఉండేదట. ఎలాగైనా మంచిగా చదువుకొని అమెరికాలో సెటిల్ అవ్వాలని అనుకున్నారట. ఆయన చదువుపై ఫోకస్ పెట్టడంతో అటు వైపు వెళ్లిపోయాడు.

శిరీష్ అమెరికా వెళ్లిపోయాక సినీ కెరీర్ పై ఫోకస్

అతను అమెరికా వెళ్లిపోయాక మరిచిపోలేకపోయింది నదియా. ఇటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా రాణించింది. మంచి మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో పాతుకుపోయింది. ఇక పెద్దలను ఒప్పించే పనిలో పడింది నదియా. ఇందుకు తగ్గట్టుగానే శిరీష్-నదియా ప్రయత్నాలు చేశారు. పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.

ప్రియుడినే పెళ్లి చేసుకున్న నదియా

వీరి వివాహం 1988లో జరిగింది. తర్వాత వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. పిల్లలు కూడా పెద్దయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని అనుకుంది నదియా. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేసింది. ప్రభాస్ తల్లిగా నటించిన మిర్చి సినిమా ఆమెకు బాగా కలిసి వచ్చింది. ఇక దాని తర్వాత స్టార్ హీరోలతో నటిస్తూ బాగా గుర్తింపు సంపాదించుకుంది నదియా. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కు అత్తగా నటించింది. ఇలా ఒక పాత్ర తర్వాత మరోటి చేస్తూ తల్లి, అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది నదియా. హీరోయిన్లకు కూడా తల్లి పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.