మళ్లీ జబర్దస్త్ కు వస్తానన్న కమేడియన్..!

0
561

ఈటీవీ జబర్దస్త్ షో ప్రారంభం నుంచి బుల్లి తెరపై సంచలనం సృష్టించింది. గురు, శుక్రవారాల్లో టీవీలకు అతుక్కునేట్టు చిన్నారుల నుంచి పెద్దల వరకూ ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ లాంటి షోలను మరి కొన్ని ఛానళ్లు ప్రమోట్ చేస్తుండడంతో దీనికి కొంచెం క్రేజ్ తగ్గినా.. ఆదే స్థాయిలో రేటింగ్ ను కొనసాగిస్తుంది.

వ్యక్తిగత అవసరాల రీత్యా తప్పుకున్నారు

‘మల్లెమాల’ నిర్మాణంలో ఈ టీవీలో ఈ షో కొనసాగుతూ ఉంది. మొదట్లో కొన్ని రోజులు జబర్దస్త్ గా అలరించింది. దీని రేటింగ్ ఆకాశాన్నంటడంతో ఎక్స్ ట్రా జబర్దస్త్ ను తెచ్చారు మల్లెమాల టీం. ఈ రెండు షోలు వరుసగా గురు, శుక్రవారాల్లో కొనసాగుతున్నాయి. ఈ మధ్య చాలా మంది కమేడియన్లు మరో ఛానల్ షోకు వెళ్లిపోవడం, కొందరు వ్యక్తిగత అవసరాల రీత్యా తప్పుకున్నారు.

సుధీర్ ముగించేశారనే గాసిప్స్

‘సుడిగాలి సుధీర్’ టీం పేరుతో నవ్వులు పూయించిన టీం లీడర్ సుధీర్ కొన్ని రోజులుగా జబర్దస్త్ కు దూరంగా ఉన్నారు. ఆయన షోను వదిలివెళ్లినట్లు పుకార్లు వినిపించాయి. కానీ మరే ఛానల్ షోలలో ఆయన కనిపించలేదు. దీంతో షోలను సుధీర్ ముగించేశారనే గాసిప్స్ కూడా గుప్పుమన్నాయి.

సుధీర్ క్లారిటీ

వీటన్నింటిపై సుధీర్ క్లారిటీ ఇచ్చారు. నవంబర్ 18న తన మూవీ ‘గాలోడు’ ప్రమోషన్ లో భాగంగా ఆయన స్టేజీపై జబర్దస్త్ లో తన రీ ఎంట్రీపై ఫైనల్ క్లారిటీ ఇచ్చాడు. తను మల్లెమాలను ఎందుకు వదిలానో.. ఇప్పుడు ఎందుకు రావాలనుకుంటున్నానో చెప్పాడు. షో నుంచి తను బయటకు రావడం పూర్తిగా వ్యక్తిగతమే అన్నారు.

మళ్లీ నవ్వులు పూయించేందుకు

కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవాలని వచ్చానని, గాలోడు షూటింగ్ కు సరిపడా డేట్స్ ఇచ్చేందుకు ఈ పని చేసినట్లు చెప్పాడు. సినిమా విడుదలైంది కాబట్టి.. మళ్లీ షోకు వెళ్లాలని నిర్ణయించుకొని ఇటీవల మల్లెమాల వారిని కలిశానని వారు కూడా ఓకే చెప్పారన్నారు. మళ్లీ నవ్వులు పూయించేందుకు జబర్దస్త్ కు వస్తానని చెప్పారు సుధీర్.