టాలీవుడ్ పాపులర్ హీరోల్లో ఆయనే నెం. 1

0
1363

టాలీవుడ్ మూవీస్ సౌత్ తో పాటు నార్త్ వారికీ చేరువై పాన్ ఇండియా లెవల్లో దుమ్మురేపుతున్నాయి. గతంలో టాలీవుడ్ హీరోలను బాలీవుడ్, తదితర వుడ్ లలో (కొందరు టాప్ హీరోలు మినహా) ఎవరూ గుర్తించే వారు కాదు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పాన్ ఇండియా రేంజ్ లో టాలీవుడ్ మూవీస్ ఆడుతుండడంతో దేశ చిత్రసీమ సైతం తెలుగు ఇండస్ర్టీ వైపు చూస్తోంది. ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్, పవన్ కళ్యాణ్ అందరికీ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనూ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

‘బాహుబలి’తో పాన్ ఇండియా ఇమేజ్

తెలుగులో మోస్ట్ పాపులర్ హీరోలపై అక్టోబర్ కు సంబంధించి ఓర్ మ్యాక్స్ ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. ఇందులో ప్రభాస్ ఎక్కువ ఓట్లను దక్కించుకొని నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ‘బాహుబలి’తో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ అదే స్థాయిలో సాహోలో కూడా అలరించాడు. ఇటీవల వచ్చిన ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అయినా ప్రభాస్ కు ఇమేజ్ ఏ మాత్రం తగ్గించలేదని ఈ సర్వే ద్వారా తెలిసింది.

ప్రభాస్ నెం.1

ఈ సర్వేలో ప్రభాస్ నెం.1గా నిలవగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, రాంచరణ్ వరుసగా నిలిచారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంచెం వెనుకబడి పోయారు. 6వ స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో వరుసగా నాని, విజయ్ దేవరకొండ ఉన్నారు. చిరంజీవి చిత్రాలు ఈ ఏడాది తక్కువగా విడుదలవడంతో 9వ స్థానంలో ఉన్నారు. వెంకటేశ్ 10వ స్థానానికి పరిమితమయ్యారు. ఈ సర్వేలో నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున చోటు దక్కించుకోలేదు.

సెకండ్ ప్లేస్ అల్లు అర్జున్

సెకండ్ ప్లేస్ లో ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ షూటింగ్ లో ఉన్నారు. ఇక ఎన్టీఆర్, రాంచరణ్ కాంబోలో వచ్చిన ‘త్రిపుల్ ఆర్’ పాన్ ఇండియా లెవల్ లో మంచి కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం జాపాన్ లో మూవీ ఆడుతోంది. విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఆశించిన మేర ఆడలేదు. ఇక చిరంజీవి రెండు సినిమాల్లో నటించగా ‘ఆచార్య’ నిరాశ పరిచింది. ‘గాడ్ ఫాదర్’ మంచి టాక్ ను దక్కించుకున్నా కలెక్షన్లలో వెనుకబడి పోయిందని సర్వే తెలిపింది.