అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్యర్య రాయ్ కి ఎక్కువ ఆస్తులు

0
307
aishwarya rai bachchan

గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ప్రచారం అవుతుందో మన అందరికీ తెలిసిందే. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఫ్యామిలీ వదిలి తన కూతురుతో వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వబోతుంది అని.

అత్తమ్మ జయా బచ్చన్ కారణంగానే ఆమె విడిపోతుంది అంటూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అయ్యింది. కానీ ఇంస్టాగ్రామ్ లో ఐశ్వర్య రాయ్ ఇప్పటికీ అభిషేక్ బచ్చన్ ని ఫాలో అవుతుంది. ఆయన పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియచేసింది. అలాగే రీసెంట్ గా అమితాబ్ బచ్చన్ మనవుడు మొదటి సినిమా ‘ఆర్చీస్’ స్పెషల్ ప్రీమియర్ షో కి హాజరు అయ్యింది.

aishwarya rai bachchan

మంచు విష్ణు కన్నప్ప చిత్రానికి హీరోయిన్ దొరికేసింది

ఇవన్నీ చూస్తే వీళ్లిద్దరు విడిపోవడం లేదనే క్లారిటీ వచ్చింది కానీ రూమర్స్ ని ఎవ్వరూ కొట్టిపారేయకపోవడం తో విడాకుల వార్త ప్రచారం అవ్వడం ఇంకా ఆగలేదు. ఇదంతా పక్కన పెడితే ఐశ్వర్య రాయి పేరిట ఉన్న ఆస్తుల విలువ అభిషేక్ బచ్చన్ కంటే ఎక్కువే అని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు.

వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఐశ్వర్య రాయ్ పేరిట ఉన్న నికర ఆస్తుల విలువ దాదాపుగా 800 కోట్ల రూపాయిలు ఉంటుందట. ఇదంతా కేవలం ఆమె సినిమాల ద్వారా సంపాదించుకున్న ఆస్తులేనట. అంతే కాకుండా ఒక్కో సినిమాకి ఆమె ప్రస్తుతం 10 నుండి 12 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది అట.

ఇవి కాకుండా ఏదైనా ప్రోడక్ట్ కి యాడ్ ఇస్తే 7 నుండి 8 కోట్ల రూపాయిలు తీసుకుంటుంది అట. ఇంత రెమ్యూనరేషన్ ని అందుకుంటున్న హీరోయిన్ ఇండియాలోనే ఎవ్వరూ లేరని అంటున్నారు. రీసెంట్ గానే పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో అద్భుతంగా నటించి తన సత్తాని చాటుకుంది ఐశ్వర్య రాయ్.

ఇప్పుడు ఆమె హీరోయిన్ రోల్స్ కంటే కూడా ఎక్కువగా ఫిమేల్ సెంట్రిక్ రోల్స్ మరియు నెగటివ్ రోల్స్ మీదనే మక్కువ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలో రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ఐశ్వర్య రాయ్ నెగటివ్ రోల్ లో నటించబోతుంది అనే టాక్ కూడా ఉంది.

ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. ఈ సినిమా తో పాటుగా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించడానికి కూడా ఆమె ఒప్పుకుందట.