మంచు విష్ణు కన్నప్ప చిత్రానికి హీరోయిన్ దొరికేసింది

0
298
kannappa movie heroine

ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా తనకంటూ ఒక ప్రయేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయిన హీరో మంచి విష్ణు. మోహన్ బాబు లాంటి లెజెండ్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు కి పలు సూపర్ హిట్ సినిమాలు అయితే ఉన్నాయి కానీ, జనాల్లో క్రేజ్ మాత్రం లేదు.

ఫలితంగా ఆయన నటించిన సినిమా వచ్చినట్టే వచ్చి వెళ్లిపోతున్నాయి. అయ్యినప్పటికీ కూడా ఆయన సినిమాలు చెయ్యడం ఆపలేదు. పట్టువీడకుండా చేస్తూనే ఉన్నాడు. దెబ్బ మీద దెబ్బ తగులుతూ డబ్బులు మొత్తం పోగొట్టుకుంటున్నా, జనాలు తనని ఆదరించట్లేదు అనే విషయం అర్థం అయ్యినప్పటికీ కూడా మంచు విష్ణు సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

అతని పట్టుదలకి ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ఇదంతా పక్కన పెడితే ఆయన డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ని కొంతకాలం క్రితమే ప్రారంభించాడు. సుమారుగా వంద కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తన సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు.

kannappa movie heroine

నన్ను మోసం చేసారు.. శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు!..

ఈ సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తుండగా, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, ఇలా ప్రతీ ఇండస్ట్రీ లో ఒక పెద్ద స్టార్ ఈ చిత్రం లో నటించడానికి ఒప్పుకున్నారు. ఇంత మంది స్టార్స్ ఉండడం తో ఈ చిత్రం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

మంచు విష్ణు కెరీర్ లో నిజంగా మళ్ళీ ఇలాంటి సినిమా రాదేమో అన్నట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి హీరోయిన్ సమస్య ఏర్పడిన సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ ని ఈ సినిమా లో హీరోయిన్ గా తీసుకున్నారు.

కానీ ఆమె డేట్స్ సర్దుబాటు చెయ్యలేక ఈ చిత్రం నుండి తప్పుకుంది. ఇప్పుడు ఆమె స్థానం లోకి ప్రీతీ ముకుందన్ ని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెని ఆహ్వానిస్తూ సోషల్ మీడియా లో ఆమెకి సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల చేసారు. దీనికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాస్ వచ్చింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ ముఖేష్ కుమార్ మాట్లాడుతూ ‘ప్రీతీ ముకుందన్ కి ఇది మొదటి సినిమా మాత్రమే కాదని,ఈ సినిమాకి ముందే ఆమె కళ మరియు సినీ రంగం గురించి ఎన్నో విషయాలను తెలుసుకొని వచ్చింది, ఈ పాత్రకి ఆమె మాత్రమే న్యాయం చెయ్యగలదు’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.