ఈ టాలీవుడ్ ‘టాల్’ పర్సన్ ఎవరో తెలుసా.. పవన్ కళ్యాణ్ తో కూడా ఆయన నటించాడు

0
229

టాలీవుడ్ లో ప్రముఖంగా హైట్ గా ఉన్న హీరోల్లో రాణా ముందు వరుసలో ఉంటారు. రాణా సినిమాల్లో జోడు పరంగా హీరోయిన్స్ వెతకడం నిర్మాత, దర్శకులకు కొంచెం తలకుమించిన భారంగా ఉంటుంది. ఇటీవల ఒక సంఘటన చోటు చేసుకుంది. రాణా కంటే కూడా ఓ నటుడు చాలా దాదాపు ఫీటున్నర హైట్ కనిపించాడు. ఇతన్ని రాణా పక్కన చూసిన హీరోయిన్ కేథరిన్ కొంచెం హైట్ చూస్కో బాస్ అంటూ చేస్తున్నట్లుగా ఉండే ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారింది.

సెకండ్ హీరోయిన్ గా కేథరిన్

ఇక్కడ ఫొటోలో ఉన్న ఈ వ్యక్తి రాణాతో పాటు పవన్ కళ్యా్ణ్ సినిమాలో కూడా కనిపించాడు. ఇతన్ని ఎవరైనా గుర్తు పట్టారా.. అయితే మీకు సినిమా నాలెడ్జ్ ఎక్కువనే చెప్పాలి. ఈ ఫొటోలో కేథరిన్ ఇద్దరినీ ఉద్దేశించి ఏదో చెప్తుంది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ పిక్ ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీలోనిది. ఈ మూవీలో కూడా సెకండ్ హీరోయిన్ గా కేథరిన్ నటించింది. చిత్రం షూటింగ్ సమయంలో ఓ ఆసక్తి కర సంఘటన కనిపించింది. ‘ఇండస్ర్టీలో నువ్వే హైట్ పర్సన్ అనుకుంటున్నావా నీకంటే హైట్ ఉన్నవారు కూడా ఉన్నారు.. కొంచెం చూసుకో బాబు హైట్’ అన్నట్లు ఈ పిక్ ఉంది.

మార్కెట్ లో జరిగే ఓ సీన్ లో

ఇక ఈ టాల్ మ్యాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘జానీ’ సినిమాలో కూడా కనిపించాడు. ఈ సినిమాతోనే ఆయన ఇండస్ర్టీలోకి ఎంటరైనట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఒక డిజాస్టర్ గా నిలిచినా పవన్ అభిమానులను మాత్రం ఇది బాగా అలరించింది. ఈ సినిమాలో పొడవైన వ్యక్తి పవన్ కళ్యాణ్ తో కలిసి మార్కెట్ లో జరిగే ఓ సీన్ లో కనిపించాడు. అతడు పవన్ కళ్యాణ్ ను చంటి పిల్లాడిలా ఎత్తుకునే సీన్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.