అది అంత ఈజీ కాదని రాజమౌళికి అర్ధమైంది

0
1086

భారీ అంచనాల మధ్య ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను అయితే కిందా మీదా పడి పూర్తి చేశాడు రాజమౌళి. వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీ అంటూ బాహుబలి క్రేజ్‌ను అడ్డుపెట్టుకుని బిజినెస్‌ గేమ్‌ ఆడాడు రాజమౌళి. యన్టీఆర్‌`రామ్‌చరణ్‌ వంటి తెలుగు స్టార్‌ హీరోలను పెట్టి తెలుగు వారికి మాత్రమే తెలిసిన అల్లూరి సీతారామరాజు, కొమురంభీంల జీవితాల్ని ఆదర్శంగా తీసుకుని ఈసినిమాకు ముందడుగు వేశారు. ఇప్పటి వరకూ సింగిల్‌ హీరోలతో పనిచేసిన రాజమౌళి తొలిసారి ఇద్దరు కమర్షియల్‌ స్టార్స్‌ను పెట్టి మల్టీస్టారర్‌ చిత్రం చేశాడు.

ఈవెంట్‌ సాక్షిగా రాజమౌళికి అర్ధం అయింది

విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఇద్దరు హీరోలను పెట్టి సినిమా తీయటం వరకూ బాగానే ఉంటుంది కానీ.. విడుదల విషయంలో… ఆ తర్వాత జరిగే తమ హీరోల పాత్రల విషయంలో తేడా వస్తే జరిగే రచ్చ మామూలుగా ఉండదు. ఈ విషయంలో రాజమౌళి పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ఏదైనా మేనేజ్‌ చేయగలను అనుకుంటాడు రాజమౌళి. అయితే తన అంచనా తప్పు అని కొద్ది రోజుల క్రితం సినీమ్యాక్స్‌లో ఏర్పాటు చేసిన భారీ ఈవెంట్‌ సాక్షిగా రాజమౌళికి అర్ధం అయింది.

అభిమానులు లేకుండా.. కేవలం మీడియాకు

ఆరోజు నందమూరి, మెగా క్యాంపుల నుంచి పాస్‌లు అందుకున్న అభిమానులు సినీమ్యాక్స్‌ థియేటర్‌లో రెండు వర్గాలుగా విడిపోయి అటు, ఇటు కూర్చున్నారు. బయట కూడా వందలమంది ఇరువురు హీరోల అభిమానులు పోగయ్యారు. బయట పరిస్థితిని గమనించిన రాజమౌళి స్వయంగా వచ్చి ఈ పరిస్థితుల్లో ఇద్దరు హీరోలను లోపలకు తీసుకురావటం సాధ్యపడదని, అభిమానులు లేకుండా, కేవలం మీడియాకు మాత్రమే మరో ప్లేస్‌ ఫిక్స్‌ చేసి చెపుతామని చెప్పుకొచ్చాడు.

అదే రోజు భయపడినంతా జరిగేదే

తమ హీరోలను చూడాలని కష్టపడి పాస్‌లు సంపాదించుకుని వచ్చిన అభిమానులు సహనం కోల్పోయి.. జై ఎన్టీఆర్‌ అని.. జిందాబాద్‌ రామ్‌చరణ్‌ అని నినాదాలు చేయటం మొదలు పెట్టారు. ఇరు వర్గాలు చెరో వైపు ఉండటం వల్ల సరిపోయింది గానీ.. లేకపోతే అదే రోజు భయపడినంతా జరిగేదే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఇరువురి అభిమానుల సమక్షంలో భారీగా చేయాలని రాజమౌళి ముందుగా అనుకున్నాడు.

ఇద్దరి అభిమానులను ఒక్కచోట చేరిస్తే

కానీ సినీమ్యాక్స్‌లో జరిగిన రచ్చ గుర్తుకు రావటంతో అనవసరంగా ఇద్దరి అభిమానులను భారీ స్థాయిలో ఒక్కచోట చేరిస్తే, ఒకవేళ చిన్న విషయంలో తేడా వచ్చినా పరిస్థితి చేయిదాటి పోతుందని, అది సినిమాపై ఇంపాక్ట్‌ చూపుతుందని రాజమౌళి భయపడుతున్నాడట. పోనీ అభిమానులతో సంబంధం లేకుండా ఈవెంట్‌ చేద్దామా అంటే, సినిమాకు మంచి మైలేజ్‌ తెప్పించే ఈవెంట్‌ను చేతులారా పాడు చేసుకున్నట్లు అవుతుందని మల్లగుల్లాలు పడుతున్నాడు దర్శకధీరుడు. మొత్తానికి అభిమానులను మేనేజ్‌ చేయడం సినిమా తీసినంత ఈజీ కాదని రాజమౌళికి అర్ధమైందన్నమాట.