వింత వ్యాధితో పూనమ్.. వ్యాధి లక్షణాలు తెలిస్తే బాధపడతారు

0
360

మహిళలు మగవారి కంటే చాలా బలంగా ఉంటారు. శారీరంగా, మానసికంగా వారు చాలా ఫిట్. అలాంటి వారికి కూడా ప్రత్యేకంగా కొన్ని వ్యాధులు వ్యాపిస్తుంటాయి. జనటిక్ గా కొన్ని రోగాలు మగవారికి రావడంలో ఎక్కువగా ఆస్కారం ఉంటే.. మరికొన్ని ఆడవారికి వస్తాయి. ఇందులో చాలా వరకు జన్యు పరమైన తేడా ఉంటుంది. స్ర్తీ, పురుష లింగాన్ని బట్టి కొన్ని వ్యాధులు వ్యాపిస్తుంటాయయి ఇందులో మగవారి కంటే ఆడవారికి ఇమ్యునిటీ పవర్ ఎక్కువగా ఉండడంతో త్వరగా కోలుకోవడంతో పాటు తట్టుకునే శక్తి ఉంటుంది.

రోగిని పూర్తిగా మంచానికి పరిమితం

కానీ బయట ఎక్కువ శ్రమ చేసే మగవారికి అది సాధ్యం కాదు వారికి ఇల్లు, ఆఫీస్ తదితర పని స్థలాల్లో ఒత్తిడి కూడా ఒకటని చెప్పచ్చు. చిత్ర పరిశ్రమను ఈ మధ్యకాలంలో వింత వ్యాధులు పీడిస్తున్నాయి. ఇవి కూడా స్టార్ హీరోయిన్ లకే వస్తుండడంతో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఇటు ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సమంత అరుదైన వయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది. కండరాలకు వ్యాపించే ఈ వ్యాధి కొన్ని రాను రాను రోగిని పూర్తిగా మంచానికి పరిమితం చేస్తుంది.

పూనమ్‌కు ఫైబ్రోమైయాల్జియా

ప్రస్తుతం సమంతకు ఎలాంటి భయాలు లేవు. ఆమె వ్యాధితో పోరాడుతూ ఉన్నారు. వ్యాధిని ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలాంటి కోవకే చెందిన వ్యాధి టాలీవుడ్ లోని హీరోయిన్ కు వచ్చింది. సమంత వయోసైటిస్ నుంచి బయటపడుతుంటే తాజాగా పూనమ్ కౌర్ ‘ఫైబ్రోమైయాల్జియా’ అనే అరుదైన వ్యాధి సోకింది. సమంతకు కండర సంబంధమైన వ్యాధి వస్తే, పూనమ్ కౌర్ కు నాడీ సంబంధమైన వ్యాధి. ఫబ్రోమైయాల్జియాతో తొందరగా అలసిపోవడం, నిద్ర, జ్ఞాపక శక్తి తగ్గడం, కండరాల నొప్పి ఉంటాయి. ఈ వ్యాధి మెదడు, వెన్నెముకపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

మగవారితో పోలిస్తే ఆడవారికే ఎక్కువ

ముదిరితే విపరీతమైన నొప్పులు వస్తాయి. శారీరానికి గాయమైనా, సర్జరీ లాంటిది జరిగినా, ఇన్ఫెక్షన్, మానసిక ఒత్తిడి వంటివి జరిగిన తర్వాత ఈ వ్యాధి వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మగవారితో పోలిస్తే ఆడవారికే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ డిసీజ్ ఉన్నవాళ్లు విపరీతమైన టెన్షన్, హెడ్ ఏక్, జాయింట్ డిసీజెస్, పేగు సంబంధిత వ్యాధులు, ఆందోళన, డీప్రెషన్‌కు గురౌతుంటారు. ఈ వ్యాధికి చికిత్స లేకున్నా కొన్ని మందులతో లక్షణాలను అదుపులో పెట్టవచ్చు అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు.

ఫైబ్రోమైయాల్జియా లక్షణాలు

కడుపునొప్పి: ఈ వ్యాధిలో కనీసం మూడు నెలల వరకూ తరుచుగా కడుపునొప్పి ఉంటుంది. శరీరం ముందు భాగం, వెనుక భాగంలో నొప్పులు రావడం, దీనికి తోడు నడుము కింద, పై భాగంలో కూడా విపరీతంగా నొప్పులు ఉంటాయి.

అలసట: వ్యాధి లక్షణాల్లో అలసట ఒకటి. సాధారణంగా ఫైబ్రోమైయాల్జియా ఉన్న వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటారు. అయినా కూడా వీరు అలిసిపోతారు. వ్యాధి తీవ్రతతో శారీరక నొప్పుల వల్ల తరుచుగా నిద్రకు భంగం కలుగుతుంది. సిరిగా నిద్రకూడా పట్టదు. సాధారణంగా ఎక్కువ సమయం బెడ్ పైనే ఉన్నా అలసట మాత్రం వీరిని వేధిస్తుంటుంది.

ఫైబ్రో ఫాగ్ అని పిలిచే ఈ వ్యాధి మానసిక పనులపై పెట్టే ఫోకస్ ను పూర్తిగా తగ్గిస్తుంది. శ్రద్ధ ఏకాగ్రత కుదరదు. వ్యాధి ముదిరిన కొద్దీ ఇది తీవ్రం అవుతుంది. దీంతో బాధితుడు పూర్తిగా జ్ఞాపక శక్తి కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. వీటితో పాటు పేగు సంబంధిత రోగాలు, మైగ్రేన్, పెయిన్ ఫుల్ బ్లాడర్ (మూత్రాశయ రుగ్మతలు), టెన్షన్, డీప్రెష్, పోస్చురల్ టాచీ టాకీ కార్డియా వంటి లక్షణాలు ఉంటాయి.
ఫైబ్రోమైయాల్జియాతో వచ్చే నరాల ప్రేరణ మెదడు, వెన్నెపాములో మార్పులు తెస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.