నయనతారను మించిపోయిన జాన్వీ కపూర్‌

0
383
Janhvi Kapoor surpasses Nayanthara
Janhvi Kapoor surpasses Nayanthara

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే… గ్లామర్‌ డాల్స్‌గా మంచి రోల్స్‌ చేస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవడం అన్నమాట. ఈ విషయం అందాల ముద్దుగుమ్మలైన కథానాయికలకు తెలిసినంతగా మరెవరికీ తెలియక పోవచ్చు.

అయితే ఇందులో కూడా రెండు రకాల వాళ్లు ఉంటారు. మొదటి రకం వారు అందంతో అవకాశాలు అందిపుచ్చుకున్నంత వరకూ ఒక వెలుగు వెలుగుతారు. ఈ క్రమంలోనే ఓవర్‌నైట్‌ స్టార్‌లు అయిపోయి..

రెండు, మూడు వరుస ఫ్లాప్‌లు పడితే అదే ఓవర్‌నైట్‌ ఫేడవుట్‌ అయిపోతారు. ఇక రెండో రకం… అందంతో పాటు అభినయం కూడా కలగలిపి..

ప్రేక్షకులతో పులిహోర కలిపి లాంగ్‌ కెరీర్‌ను కొనసాగిస్తారు. వీరి డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది.
ఈ రెండో కోవకు చెందిన నటి నయనతార.

దాదాపు 18 ఏళ్ల క్రితం కెరీర్‌ను ప్రారంభించిన నయనతార ప్రారంభంలో గ్లామర్‌ రోల్స్‌కు ప్రాధాన్యం ఇచ్చి టాప్‌ హీరోయిన్‌ రేంజ్‌కు చేరుకుంది. అటు తమిళం, ఇటు తెలుగు, పక్కన మలయాళం, మరోపక్క కన్నడం ఇలా భాషా బేధం లేకుండా అభిమానులను సంపాదించుకుని రికార్డ్‌ సృష్టించింది.

రాను రాను గ్లామర్‌ పాత్రలతో పాటు నటనకు స్కోప్‌కు ఉన్న క్యారెక్టర్‌లను ఎంచుకుని నెమ్మదిగా 10 లక్షలతో మొదటు పెట్టిన రెమ్యునరేషన్‌ను 5 కోట్ల వరకు తీసుకు వెళ్లింది.

The star director who shot the story near Sharadagari
The star director who shot the story near Sharada garu

నయనతార హీరోయిన్‌గా నటించాలంటే 3 నుంచి 4 కోట్లు సమర్పించుకోవాల్సిందే. అదే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ అయితే 6 కోట్లు తీసుకుంటుందట. దక్షిణాది హీరోయిన్‌లలో నయనతారదే టాప్‌ రెమ్యునరేషన్‌.

అయితే తాజాగా శ్రీదేవి కూతురు జాన్వికపూర్‌ ఈ రికార్డ్‌ను అతి స్వల్ప కాలంలోనే తుడిచేసిందట. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’లో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం జాన్వీ 6 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో మరో ట్విస్ట్‌ ఏమిటంటే ‘దేవర’ రెండు భాగాలుగా రానుంది.

ఈ రెమ్యునరేషన్‌ తొలి భాగానికి మాత్రమే. సెకండ్‌ పార్ట్‌లో కూడా జాన్వీ పాత్ర ఉంటే దానికి మరో 5 నుంచి 6 కోట్లు లాగేయకుండా ఉంటుందా.

ఇలా దక్షిణాదిన చేస్తున్న తొలి సినిమాకే అత్యధిక పారితోషికం తీసుకుని ఇప్పటికే టాప్‌ ప్లేస్‌లో ఉన్న నయనతార రికార్డును బ్రేక్‌ చేసిందట జాన్వీ. ఎంతైనా నేషనల్‌ క్రష్‌ కదా.. ఆ మాత్రం ఇవ్వాల్సిందే..