డబ్బు కోసం ఇంత దిగజారుడు తనమా.. సినీ నటి మీన వారిపై ఫైర్

0
589

హీరోయిన్ మీన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆమె నటన అంటే అందరికీ ఆసక్తి ఉండేది. బాల నటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది మీన. అప్పట్లో స్టార్ హీరోలతో ఆమె నటించిన ఆమె అందరి మెప్పును పొందింది. సదరు స్టార్ హీరోలు కూడా మీనా డేట్స్ ఖాళీగా ఉన్నాయో తెలుసుకుంటే తాను డేట్స్ ఇస్తానంటూ చెప్పేవారంటే ఆమె లెవలేమిటో అర్థమవుతుంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ర్టీలో ఆమెకు ఉన్న క్రేజ్ సమాకాలీకుల్లో ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్, తెలుగు మోగాస్టార్ చిరంజీవితో ఎన్నో సినిమాల్లో చేసిన ఆమె. అభిమానులను మెప్పించారు.

విద్యాసాగర్ తో వివాహం

మీనా తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఇండస్ర్టీకి సంబంధం లేని ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన విద్యా సాగర్ ను వివాహం చేసుకున్నారు. తర్వాత ఇండస్ర్టీకి దూరంగా ఉన్నారు. పాప పుట్టిన తర్వాత కొన్ని రోజులకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మీనా.. తల్లీ, అత్త పాత్రలకు ఓకే చెప్పంది. ఈ నేపథ్యంలో పోస్ట్ కోవిడ్ తో తన భర్త విద్యాసాగర్ ఆరోగ్యం విషమించి ఇటీవల మృతి చెందాడు. తర్వాత ఆమె కూతురుతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వింత రూమర్ బయల్దేరింది. నటి మీనా రెండో పెళ్లి చేసుకుంటుందట అంటూ.. ఈ వార్తలను ఆమె తీవ్రంగా ఖండించింది.

సోషల్ మీడియాపై గుస్స

తన భర్త మరణం తర్వాత తీవ్ర డీప్రెషన్ లోకి వెళ్లిన మీన ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటుంది. కానీ రూమర్ రాయుళ్లు మళ్లీ ఆమెపై విరుచుకుపడ్డారు. నటి మీన రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ గాసిప్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో ఇది తీవ్రంగా వైరల్ అయ్యింది. పెళ్లి నిశ్చమైంది అనే స్థాయిలో రూమర్లు వ్యాపించాయి. దీంతో నటి మీన రూమర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంతకు తెగిస్తారా అంటూ ఆగ్రహం

‘తన తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల, కూతరు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని మీనా రెండో పెళ్లి’ అంటూ వచ్చిన వార్తలపై నిజం లేదని మీన చెప్పింది. ఈ వార్తలను క్రియేట్ చేసే వారికి సిగ్గుందా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్బు కోసం ఇంతకు తెగిస్తారా..? అంటూ మండిపడింది. ఇలాంటి రూమర్స్ తో ఒక కుటుంబం ఎంత సఫర్ అవుతుందో పట్టించుకోరా అంటూ నిలదీసింది. తాను రెండో పెళ్లి ప్రస్తావన ఎప్పుడైనా తీసుకువచ్చానా.. ఎక్కడైనా చెప్పానా.. ఇంత దారుణమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అలాంటిది జరిగితే తప్పుకుండా చెప్తా

ఇప్పటి వరకూ తన నుంచి తన కుటుంబం నుంచి గానీ రెండో పెళ్లి ప్రస్తావన రాలేదని, తన కూతరు భవిష్యత్ కు చాలినంత డబ్బు ఉందని, తనకు రెండో పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే తప్పకుండా చెప్తానని ఆమె చెప్పుకచ్చింది. తనను రెండో పెళ్లి చేసుకునే వారిని కూడా రూమర్స్ రాయుళ్లు ఎక్కడి నుంచి తీసుకువచ్చారని మండిపడింది. ఈ రూమర్స్ ను ఇంత కాలం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నా. ఈ మధ్య ఇవి మరీ హద్దులు దాటుతున్నాయని, వీటిపై స్పందించకుంటే మరిన్ని వ్యాపిస్తాయని అందుకే క్లారిటీ ఇస్తున్నట్లు చెప్పారు మీన. ఇలాంటి వార్తలు ఆపకపోతే బాగుండదు అంటూ రూమర్ రాయుళ్లను గట్టిగా హెచ్చరిందింది. ఆమె రెండో పెళ్లిపై క్లరిటీ ఇవ్వడంతో ఈ రూమర్లకు ఇక ఫుల్ స్టాప్ పడినట్లే అయ్యింది.