‘పవన్ కూ నాకూ గ్యాప్ రాలేదు.. రప్పించారు’.. అలీ సంచలన కామెంట్లు

0
1617

టాలీవుడ్ ఇండస్ర్టీలో పవన్ కళ్యాణ్, అలీ మంచి స్నేహితులు. పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నారంటే అందులో అలీ ఉండాల్సిందే. అంత మంచి స్నేహం వీరి మధ్య పెనవేసుకుంది. నేను చేసే ప్రతీ సినిమాలో అలీకి తప్పనిసరిగా పాత్ర ఉండాలని దర్శక నిర్మాతలకు సూచించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అలీకి దూరంగా ఉన్నారు. పవన్ ఫ్యామిలీతో కూడా అలీ సన్నిహితంగా ఉండేవారు. వారింట్లో ఎలాంటి చిన్నపాటి శుభకార్యమైనా అలీ ఉండాల్సిందే.

పవన్ కు దూరమైన అలీ

అయితే ఇటీవలి కాలంలో ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో అలీ జనసేనవైపు కాకుండా వైసీపీ వైపు వెళ్లారు. ఇంకా కొన్ని రాజకీయ విభేదాలు నెలకొనడంతో అలీ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. అలీ వైసీపీకి వెళ్లిన సమయంలో పవన్ అభిమానులు కొంచెం నీరాశకు లోనయ్యారట. అలీ లేకుండా సినిమాలు తీయని పవన్ కళ్యాణ్ ను కాదని వైసీపీలోకి వెళ్లడం కరెక్టు కాదని కామెంట్లు కూడా చేశారట.

అలీ కూతురి పెళ్లికి రాని పవన్

అయితే ఇటీవల అలీ పెద్ద కూతురు వివాహం జరిగింది. ప్రముఖులను పిలవడంతో భాగంగా పవన్ కళ్యాణ్ ను కూడా పిలిచేందుకు అలీ వెళ్లారు. కానీ పవన్ కళ్యాణ్ అలీకి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో వెనుతిరిగి వచ్చారు. విషయం తెలిసి కూడా వివాహానికి రాలేదు పవన్ కళ్యాణ్. దీంతో ఇండస్ర్టీలో పెద్ద చర్చ నడిచింది. ఇద్దరి మధ్య దూరం మరింత పెరుగుతూ వస్తుంది. పవన్ కళ్యాణ్ వివాహానికి రాకపోడంపై అలీ వివరణ ఇచ్చినా అది ఫ్యాన్స్ ను షాటిఫై చేయలేక పోయింది.

సుమ ప్రశ్నకు బదులుగా

అయితే తాజాగా అలీ విభేదాలకు గల కారణం వివరించాడు. అలీ ఈ టీవీలో ‘అలీతో సరదాగా’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ షోకు యాంకర్ సుమ వచ్చారు. ఇద్దరి మధ్య ఈ ఆసక్తికర సంభాషణ జరిగింది. యాంకర్ సుమ అలీని కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇందులోనే ‘పవన్ కళ్యాణ్ కు మీకు గ్యాప్ ఎందుకు వచ్చింది..?’ అని అడిగింది. దీంతో అలీ మాట్లాడుతూ ‘పవన్ కు నాకు గ్యాప్ రాలేదు.. వారే రప్పించాడని చెప్పాడు’. అయితే ఈ గ్యాప్ కు కారణమైన వారు ఎవరు అనేది చర్చకు దారి తీసింది. దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి మరి.

అలీ ఉంటే వినోదం

పవన్ కళ్యాణ్ తో విభేదాల నుంచి అలీ ఆయన చిత్రాలకు కూడా దూరమయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమాలో అలీ ఉంటే వినోదం బాగుంటుంది. ఇండస్ర్టీలో కూడా మంచి స్నేహితులైన వీరు విడిపోవడాన్ని ఎవరూ స్వాగతించడం లేదనే చెప్పాలి. వీరి మధ్య దూరం తగ్గాలని ఇటు పవన్, అటు అలీ ఫ్యాన్ కోటి కళ్లతో ఎదురు చూస్తున్నరనడంలో సందేహం లేదు.