ఇనయాకు పెళ్లి అయిపోయిందా..?

0
940

బిగ్ బాస్ సీజన్ 6 కు ముందు ఇనయా సుల్తానా గురించి ఎవరీ తెలియదు. ఈ షోకంటే ముందు ఆర్జీవీతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొన్ని రోజుల్లోనే ప్రేక్షకులు మరిచిపోయారు. ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చిన తర్వాత ఆమె క్రేజ్ మరోలా మారింది. హౌజ్ లోకి నెగెటివ్ ఈమేజ్ తోనే కటెస్టెంట్ వచ్చింది ఇనయా సుల్తానా. ఇటీవల ఆమె ఎలిమినేషన్ కూడా అయ్యింది. అయితే ఇది సరైన నిర్ణయం కాదని బిగ్ బాస్ ను ప్రశ్నించే వారు చాలా మందే ఉన్నారు. ట్విటర్, ఇన్ స్ర్టాలో కూడా లక్షలాది ట్వీట్లు పెట్టారు. బిగ్ బాస్ హౌజ్ లో ఆమె ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

నెగెటివ్ ఇమేజ్ తో హౌజ్ లోకి

హౌజ్ లోకి ఎంటరైన సమయంలో కంటెస్టెంట్లు అందరూ ఇనయా రెండు నుంచి మూడు వారాలకంటే ఎక్కువ సమయం ఉండదని అనుకున్నారట. అయితే వారి అంచనాలకు అందకుండా ఆమె విలక్షణమైన ఆట తీరును కనబరుస్తూ దూసుకుపోయారు. దాదాపు ఎలిమినేట్ కు రెండు వారాల ముందు కూడా ఆమె హౌజ్ లీడర్ గా కూడా కొనసాగారు. అప్పుడు అందరూ ఇనయానే బిగ్ బాస్ 6 విజేత అంటూ జోస్యం చెప్పారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ బిగ్ బాస్ ఇనయాను ఎలిమినేట్ చేశాడు. ఆర్జీవీ బ్యూటీ అంటూ హౌజ్ లో నెగిటివ్ కామెంట్లకు తట్టుకుంటూ ఒంటరిగా పోరాడింది.

ఇనయాకు పెరిగిన క్రేజ్

సీజన్ 6లో ఎక్కువగా బాధలు తట్టుకున్నది ఎవరంటే ఠక్కున చెప్పే పేరు కూడా ఇనయా సుల్తానే. ఇంటి సభ్యులు ఆమెను డీగ్రేడ్ చేసేందుకు చాలా సార్లు ప్రయత్నాలు కూడా చేశారు. హౌజ్ లోకి ఎంటర్ కాక ముందు నుంచే ఇనయా చాలా మాటలను ఫేస్ చేసింది కాబట్టి వీరి మాటలకు ఆమె ఎంత మాత్రం జంకలేదు.

ఇక ఇనయా సుల్తానా ఎలిమినేట్ అవబోతుందన్న వార్త లీకైన వెంటనే ట్వీట్ల ట్రెండింగ్ మొదలైంది. లక్షకు పైగా ‘ఇనయా సుల్తానా అన్ ఫెయిర్ ఎలిమినేషన్’ అంటూ ట్వీట్లు మోగించారు. అయితే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ టీం అర్ధరాత్రి ఇంటికి తీసుకెళ్తారు. అందుకే ఆమె ఎలిమినేషన్ అయ్యాక చాలా మంది అభిమానులు అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లారట. ఇవన్నీ పక్కన పెట్టి అసలు విషయానికి వద్దాం..

ఇనయా పెళ్లి పిక్ హల్ చల్

ఇనయా సుల్తానాకు పెళ్లి జరిగిందని ఈ మధ్య ఒక ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఆమె తల్లి కూడా ఉండడంతో ఇనయాకు ఇదివరకే పెళ్లి జరిగిందని పుకార్లు నిజమని నమ్ముతున్నారు నెటిజన్లు. ఇనయా పెళ్లి కూతురిగా తయారవడం. పేరంట్స్ కూడా పక్కన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ హౌజ్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇనయాపై ఇలాంటి రూమర్లు క్రియేట్ చేసి ఆమె ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారంటూ కొదరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా ఆమెకు పెళ్లయిందన్న వార్తపై ఇంకా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.