విమానంలోంచి దూకిన మెహరీన్ కౌర్..!

0
466

‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది మెహరీన్ కౌర్. సిక్కు కుటుంబానికి చెందిన మెహరీన్ హిందీ, తమిళ్, తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. కృష్ణ గాడి వీర ప్రేమక గాథ అమ్మడికి మంచి బ్రేకనే చెప్పాలి. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం. తర్వాత రాజా దిగ్రేట్, ఎఫ్-2 తదితర చిత్రాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కూడా గుర్తింపు దక్కించుకుంది. ఇటీవల ఆమె పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఒక పొలిటిక్ ఫ్యామిలీలోకి ఆమె అడుగితుందని. దానికి సంబంధించి ఇటీవలి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.

పొలిటికల్ ఫ్యామిలీతో బ్రేకప్

టాలీవుడ్ లో మంచి ట్రాక్ లో దూసుకుపోతోంది సిక్కు ముద్దుగుమ్మ కెరియర్. హరియాణా మాజీ సీఎం భవన్ లాల్ బిష్ణోయ్ మనుమడు భవ్య బిష్ణోయ్ తో అమ్మడికి నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి తేదీని త్వరలోనే ప్రకటిస్తుందని టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో బిష్ణోయ్ తో మెహరీన్ బ్రేకప్ చేసుకున్నారన్న వార్తలు ఇండస్ర్టీలో ప్రకంపణలు పుట్టించాయి. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ పై మరింత దృష్టి పెట్టింది. వరుస ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతోంది. వెకేషన్లలో కూడా మెహరిన్ తెగ ఎంజాయ్ చేస్తుందట.

స్కైడైవ్ చేసిన మెహరీన్

వెకేషన్ లలో ఎంజాయ్ చేసే ఈ బ్యూటీ ఒక సారి విమానం నుంచి కిందికి దూకిందట. అవును మీరు విన్నది నజమే మరి. కానీ ఆమెకు ఏమీ కాలేదట. ఎందుకో తెలుసా. ఆమె స్కైడైవ్ చేసింది కాబట్టి. ఈ మధ్య వెకేషన్ లో ఉన్న ఈ అమ్మడికి ఒక సరదా ఫీట్ చేయాలనిపించిందట. ఇంకెందుకు ఆలస్యం వెంటనే దానికి సమాయత్తమైంది. వెంటనే ఒక విమానంలో ఫీట్ చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంది. ఇక గాల్లో ఉన్న ప్లెయిన్ లోంచి వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి దునికింది.

వైరల్ గా మారిన ఫీట్ వీడియో

మెహరీన్ కౌర్ ఈ ఫీట్ ను తన కెమెరాలో నిక్షిప్తం చేసుకుంది. రీసెంట్ గా ఈ వీడియోను సోషల్ మీడియాలోకి వదిలింది. దీంతో నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ ముద్దుగుమ్మకు ఇలాంటి డైవ్ చేయాలని ఎందుకు అనిపించిందని అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ మెహరిన్ మాత్రం గాల్లో తేలుతూ, కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేసింది.

వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అమ్మడు

గత సంక్రాంతికి వచ్చిన ఎఫ్2లో మెహరీన్ కౌర్ అలరించింది. ఆమె నటనకు సంబంధించి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె చేతుల్లో మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంత బిజీగా ఉండే ముద్దుగుమ్మ వెకేషన్లకు మాత్రం వెళ్లడం మరిచిపోవడం లేదు. ఉన్న తక్కువ సమయాన్ని ఆనందంగా జీవించాలని మెహరీన్ కౌర్ చెప్తుంది. కానీ ఆమె బిష్ణోయ్ కుటుంబంతో సంబంధాలు ఎందుకు తెంచుకుందో తెలియకపోగా.. ఇప్పటి వరకూ ఈ విషయంపై అమ్మడు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.