స్టార్ ఇంటికి కోడలుగా వెళ్తున్న శ్రీముఖి.. ఊహించని షాక్

0
968

శ్రీముఖి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. స్టార్ యాంకర్ గా దూసుకుపోతున్న ఆమె పలు సందర్భాల్లో సంచనాలకు కూడా తెరలేపింది. ఇప్పుడున్న యాంకర్లలో రష్మీ గౌతవ్, అనసూయ వెండితెరపై బిజీగా ఉండగా.. షోలు, ఈవెంట్లు చేస్తూ బాగానే రాణిస్తుంది శ్రీముఖి. రాములమ్మ సినిమాలోని ఒక పాటకు శ్రీముఖి చేసిన డ్యాన్స్ తో అప్పట్లో మరింత ఫేమ్ అయ్యింది ఈ బుల్లితెర బ్యూటీ. ట్రెండింగ్ లో దూసుకుపోవడం ముద్దుగుమ్మకు కొత్తేమి కాదు. పలుచటి చీరలు, గ్లామర్ చూపిస్తూ సోషల్ మీడియాలో ఆమె పెట్టే పిక్స్ కు భారీ లైకులే వస్తుంటాయి.

స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి శ్రీముఖి

అయితే ఇటీవల ఒక న్యూస్ ఇండస్ర్టీలో చెక్కర్లు కొడుతుంది. బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి కోడలిగా వెళ్తున్నారట. ఈ మేరకు ఇరువురి బంధువులు కూడా మాట్లాడుకున్నారట. కానీ శ్రీముఖి మాత్రం టాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చిందట. అవునండి మీరు విన్నది నిజమే అంటున్నాయి చిత్ర వర్గాలు. సదరు స్టార్ ప్రొడ్యూసర్ శ్రీముఖిని తన ఇంటికి కోడలిగా తెచ్చుకోవాలని అనుకున్నాడట. ఈ మేరకు సదరు స్టార్ ప్రొడ్యూసర్ శ్రీముఖి వాళ్ల నాన్న వద్దకు వచ్చి పెళ్లి సంబంధం గురించి కూడా మాట్లాడారట.

శ్రీముఖి వాళ్ల మాత్రం తన బిడ్డ అనుమతి లేనిదే ఏం చేయనని, ఆమె ఇష్టపడితేనే పెళ్లి చేస్తానని సూచించరట. తర్వాత జరిగిన పరిణాలతో శ్రీముఖి ఈ సంబంధానికి నో చెప్పిందని తెలుస్తోంది. వివాహం విషయంలో ఇటీవల శ్రీముఖి ఒకరికి కమిట్ అయ్యిందట. అందుకే ఇంత పెద్ద సంబంధానికి కూడా నో చెప్పిందని ఇండస్ర్టీలో టాక్ వినిపిస్తుంది. దీనిపై శ్రీముఖి కానీ, ఆమె కుటుంబం కానీ, సదరు స్టార్ ప్రొడ్యూసర్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

శ్రీముఖి ఇంటి తలుపు తడుతున్న ఇండస్ర్టీ

వరస షోలు, ఈవెంట్లతో బిజీగా ఉన్న శ్రీముఖి బుల్లితెర యాంకర్ లలో టాప్ లో ఉంది. యాంకర్ లలో టాప్ త్రీ పొజిషన్ లో ఉంది ఆమె. అదే స్థాయిలో రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుంది. రెండు చేతులా ఎడా పెడా సంపాదిస్తూ శ్రీముఖి ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఇటీవలి కాలంలోనే ఈ ముద్దుగుమ్మ ఒక అందమైన ఇంటిని కూడా కొనుగోలు చేసింది. స్టార్ ప్రొడ్యూసర్ సంబంధం వదులుకున్న ఆమెకు నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..? అన్న విషయంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.

ఇంతటి స్టార్ ప్రొడ్యూసర్ సంబంధం వచ్చిందంటే ఇక తర్వాత కూడా మంచి మంచి ఇండస్ర్టీ సంబంధాలు శ్రీముఖి తలుపుతడతాయి అంటున్నారు నెటిజన్లు. బాయ్ ఫ్రెండ్ గురించి రివీల్ చేస్తుందా..? లేక ఇండస్ర్టీలోని ఎవరినైనా పెళ్లి చేసుకుంటుందా..? అని విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా శ్రీముఖి మంచి ఆఫర్ ను వదులుకుందని ప్రస్తుతం నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.