అభిమానులకు దూరంగా ఎన్టీఆర్.. అందుకే వెళ్తున్నాడా..?

0
235

‘ఆర్ఆర్ఆర్’ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన వేరే లెవలనే చెప్పాలి. గోండు వీరుడిగా ఆయన నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం కోసం బాగానే కష్టపడ్డారట యంగ్ టైగర్. పాన్ ఇండియా లెవల్ లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్లను సైతం తిరగరాసింది. అయితే ఇటీవల చిత్ర యూనిట్ జాపాన్ లో డబ్ చేసి రిలీజ్ చేశారు. అక్కడ కూడా రికార్డుల మోత మోగిస్తుంది ఈ మూవీ. గతంలో ముత్తుపై ఉన్న రికార్డులను ఇప్పటికీ బ్రేక్ చేసిందని అక్కడి చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ఫ్యామిలీతో

ఆర్ఆర్ఆర్ ఇటీవలె జపాన్ లో కూడా రిలీజైంది. అయితే రాం చరణ్, ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి సతీ సమేతంగా జపాన్ వెళ్లారు. అది రిలీజ్ కోసమే అయినా చిత్ర యూనిట్ ఫ్యామిలీ వెకేషన్ గా కూడా మారింది. హీరోలు, దర్శకులు వారి వారి కుటుంబ సభ్యులతో జపాన్ లో సందడి చేశారు. అటు నుంచి అటే మరికొన్ని ప్రదేశాలను కూడా చిత్ర యూనిట్ తిరిగి వచ్చింది. జపాన్ లో చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తుంది.

ఇక ఈ చిత్రంతో రాజమౌళి అనేక అవార్డులను సొంతం చేసుకుంటున్నారు. ఇటీవలే ఒక ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ అవార్డును కూడా ఈ చిత్రం తన ఖాతాలో వేసుకుంది. గ్లోబల్ మూవీ స్టేజీపై ఆర్ఆర్ఆర్ కు ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. ఈ మూవీతో ఎన్టీఆర్ ఐఎండీబీ ర్యాంకింగ్స్ లో తన సత్తా చాటాడు. టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు.

గ్యాప్ ను ఫిల్ చేస్తున్న యంగ్ టైగర్

ఆర్ఆర్ఆర్ జోష్ లో ఉన్నరు ప్రస్తుతం ఎన్టీఆర్. తన తర్వాతి చిత్రం కొరటాల శివతో కమిట్ అయ్యారు. దీంతో డైరెక్టర్ కొరటాల శివ కూడా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంతోనే అనిరుధ్ ఫస్ట్ ఎన్టీఆర్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నారు. ఆయన సాంగ్స్ కు ఎన్టీఆర్ డ్యాన్స్ థియేటర్లు మోతమోగేలా ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ సెట్స్ పైకి వెళ్లేలోగా ఎన్టీఆర్ అలా ఫ్యామిలీతో జాలీ ట్రిప్ ప్లాన్ చేశారట. అమెరికాకు వెళ్లనున్నట్లు తెలిసింది.

ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్

కొరటాల శివ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు కొంత సమయం ఉండడంతో వచ్చిన గ్యాప్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు ఎన్టీఆర్. అందుకే కుటుంబంతో అమెరికా వెకేషన్ ను ప్లాన్ చేశారు. ఈ ట్రిప్ నెల రోజులు ఉంటుందట. అంత వరకూ ఆయన అటు సినిమాలకు గానీ, ఇటు అభిమానులకు గానీ అందుబాటులో ఉండరని సమాచారం. ఆయన కుటుంబ సభ్యులతో అమెరికాకు వెళ్తున్న నేపథ్యంలో ఎయిర్ పోర్టులో కనిపించారు.

బ్లాక్ టీ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఫుల్ స్టయిల్ గా ఉన్నారు. ఇద్దరు కొడుకులు ఆయనతో పాటు నడుస్తున్నారు. ఇక కొరటాల మూవీ అయిపోయాక ప్రశాంత్ నీల్ తో మరో ప్రాజెక్టు చేయాలని ఎన్టీఆర్ కమిట్ అయినట్లు ఇండస్ర్టీ వర్గాలు చెప్తున్నాయి.