సినిమాలనే మించి పోతున్న ఓటీటీ రెమ్యునరేషన్.. ఏ స్టార్ కు ఎంతో తెలుసా..?

0
245

ప్రస్తుతం నడుస్తున్నది ఓటీటీ జమానా. ఇంత కాలం టీవీలు సీరియళ్ల స్థానాన్ని ఓటీటీలు చాపకింద నీరులా ఆక్రమించాయీ అనడంలో సందేహం లేదు. అయితే ఒక్కో స్ర్టీమింగ్ సంస్థది ఒక్కో విధానం పాపులర్ స్ర్టీమింగ్ ప్లాట్ ఫారంలు మంచి కంటెంట్ ఉన్న ప్రోగ్రామ్ లను ఎంచుకొని స్టార్ హీరోలతో కండెక్ట్ చేస్తున్నారు. దీంతో వారికి లాభాలు వరదలా వచ్చి పడుతున్నాయి.

ఇప్పుడు టాలీవుడ్ లోని టాప్ హీరోలు, హీరోయిన్లు ఓటీటీ వైపు చూస్తున్నారు. అందులో ఎక్కువ కష్టపడకున్నా రెమ్యునరేషన్ మాత్రం భారీగానే వస్తుంది. ఓటీటీ నిర్వాహకులు కూడా యాంకర్లతో చేస్తే రొటీన్ గా ఉంటుందని భావించి స్టార్ హీరోలతో షోలను కండెక్ట్ చేస్తున్నారు. దీంతో పబ్లిసిటీ, రెవెన్యూ బాగానే వస్తున్నాయి. వీటిలో చేసేందుకు స్టార్ హీరో, హీరోయిన్లు కూడా ఇంట్రస్ట్ చూపుతున్నారు.

సినిమా అయితే నెలలు నెలలు, ఒక్కో సారి వాయిదా పడుతూ సంవత్సరాలు గడుస్తుంది. కానీ షోలు అలా కాదు. దాదాపు కొన్ని ఎపీసోడ్ల వరకూ ఒకేసారి షూట్ చేస్తారు. కాబట్టి మిగతా టైం సినిమాలకు కేటాయించుకోవచ్చు అనే షోలను తీస్తున్నారు.

చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఆయన షోకు గానూ రూ. 9కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట.

రోజా

ఇటు షోలతో పాటు పొలిటీషియన్ గా రాణించారు సినీ నటి రోజా. ఇటీవల ఆమె మంత్రి కావడంతో ఇక షోలు చేయనని చెప్పింది. కానీ ఈ టీవీలోని జబర్ధస్త్ షోకు తన భుజస్కంధాలపై నడిపిన రోజా రూ. 2 లక్షల వరకూ రెమ్యునరేషన్ తీసుకున్నాట.

నాగార్జున

మా టీవీలో భారీ వ్యూవ్స్ తో సాగుతున్న బిగ్ బాస్ అన్ని రంగాల ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఈ బిగ్ బాస్ ప్రస్తుతం సీజన్ 6 కొనసాగుతుంది. దాదాపు చాలా సీజన్లకు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించారు. దీనికి గానూ ఈయన రూ. 5 నుంచి రూ. 6 కోట్ల వరకూ తీసుకున్నాట.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి అంటేనే ఒక వెరైటీ ఆమె దర్శకత్వం, ప్రొడెక్షన్, యాడ్ ఫిలిం, యాక్టర్ చాలా రంగాలలో రాణించారు. ఆమె ఏది చేసినా స్పెషల్ గా ఉంటుంది. అయితే ఆమె చాలా షోలను కూడా కండక్ట్ చేస్తున్నారు. ‘ఆహా’లో వంటల రాణిగా కూడా రాణిస్తున్నారు. అయితే ఆమె ఒక్కో షోకు దాదాపు 2 లక్షల వరకూ తీసుకుంటున్నారట.

సాయి కుమార్

డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇండస్ర్టీకి వచ్చిన సాయికుమార్ విలక్షణ నటుడిగా ఎదిగారు. ఎంతో మంది సీనియర్ స్టార్ హీరోలకు గాత్రదానం చేశారు ఆయన. ఈ మధ్య టీవీషోల్లోకి కూడా వచ్చారు. ఈ టీవీలో ‘వావ్’ షో తీస్తున్నారు. దీనికి గానూ ఒక్కో షోకు ఆయనకు రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలు రెమ్యురేషన్ తీసుకుంటున్నారట.

సమంత

టాలీవుడ్ ఇండస్ర్టీలో సమంత పేరు తెలియని వారుండరు. ఆమె నటన ఆ స్థాయిలో ఉంటుంది. ఆయితే ఆమె కూడా షోలకు హోస్ట్ గా చేసింది. ఆమె ‘ఆహా’లో ‘సామ్ జామ్’ అనే ప్రోగ్రామ్ కు హోస్ట్ గా బాధ్యతలు తీసుకుంది. అయితే దీనికి గానూ ఆమె రూ. కోటి నుంచి రూ. 2 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుందట.

నందమూరి బాలకృష్ణ

యువరత్నం నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు ఈ మధ్య ఓటీటీలో బాగా సందడి చేస్తున్నారు. ఆయన ‘ఆహా’ ప్లాట్ ఫారంపై చేసిన ‘అన్ స్టాపబుల్’ షోకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు సీజన్ 2తో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. ఈ షో కోసం ఆయన రూ. 5 కోట్ల వరకూ తీసుకుంటున్నారని టాక్.