‘సలార్’ దెబ్బకి ‘డుంకీ’ ఆ ఫేమస్ థియేటర్ నుండి అవుట్!

0
416
Dunki vs Salaar Opening Day Collections

భారీ అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్ ‘సలార్’ చిత్రానికి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగా బీభత్సమైన ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. నిర్మాతలు విడుదల చేసిన పోస్టర్ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 180 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఈ ఏడాది లో విడుదలైన అన్నీ సినిమాలకంటే సలార్ కి ఎక్కువ ఓపెనింగ్ వచ్చిందని అంటున్నారు నిర్మాతలు. ఇదంతా పక్కన పెడితే పాపం సలార్ దెబ్బకి బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ పరిస్థితి దయనీయంగా మారింది.

Dunki vs Salaar Opening Day Collections

దుమ్ము లేపేసిన ‘సలార్’ మొదటి రోజు వసూళ్లు

రెండు వెయ్యి కోట్ల రూపాయిల సినిమాలను కొల్లగొట్టి ఈ ఏడాది చరిత్ర తిరగరాసిన షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ తో కలిసి చేసిన ‘డుంకీ’ చిత్రం ఇటీవలే విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ జానర్ ప్రభావం వల్ల ‘డుంకీ’ చిత్రం ఓపెనింగ్స్ లో బాగా వెనకబడింది.

ముఖ్యంగా ‘సలార్’ చిత్రానికి షోస్ రానివ్వకుండా షారుఖ్ ఖాన్ మరియు అతని టీం చేసిన చీప్ ట్రిక్స్ కి బాలీవుడ్ పెద్దలు సైతం పెదవి విరిచారు. అందరి సంగతి పక్కన పెడితే షారుఖ్ ఖాన్ అడ్డాగా పిలవబడే మరాఠా మందిర్ థియేటర్ ఓనర్ కూడా సలార్ చిత్రం పై జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడం షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి.

ఈ థియేటర్ లో షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘దుల్హనియా లేజాయింగే’ చిత్రం పాతిక సంవత్సరాల నుండి నాన్ స్టాప్ గా ఆడుతూనే ఉంది. ఈ థియేటర్ లో రీసెంట్ గా విడుదలైన ‘డుంకీ’ చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. కానీ జనాలు లేకపోవడం తో ‘సలార్’ చిత్రం విడుదల రోజు ‘డుంకీ’ ని ఎత్తివేయాల్సి వచ్చింది. ఇది షారుఖ్ ఖాన్ అభిమానులకు కోలుకోలేని షాక్ అనే చెప్పాలి.

ఒక తెలుగోడి సినిమా దెబ్బకు బాలీవుడ్ సూపర్ స్టార్ కు ఇన్ని అవమానాలు జరగడం చూస్తుంటే ప్రభాస్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో అందరికీ అర్థం అవుతుంది. ఈ ఒక్క సంఘటన తో ప్రభాస్ బాలీవుడ్ లో ఉన్నటువంటి ఖాన్స్ అందరికంటే పెద్ద సూపర్ స్టార్ అని ఫిక్స్ అయిపోవచ్చు అంటూ ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

ఇక సలార్ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా అందుకుంటే చూడాలని ఉందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా కోరుకుంటున్నారు.