ప్రభాస్ హీరో గా నటించిన సలార్ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అంచనాలకు తగ్గట్టుగానే ప్రభాస్ కటౌట్ ని ఎలా వాడుకోవాలో, అలా వాడుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
అందుకే ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఈ చిత్రం చూసి చాలా సంతృప్తి చెందారు. ఇక ఓపెనింగ్స్ కూడా వేరే లెవెల్ లో ఉన్నాయి. నిర్మాతలు విడుదల చేసిన ప్రమోషనల్ పోస్టర్స్ లో అయితే మొదటి రోజు ఈ చిత్రానికి 178 కోట్ల రూపాయిలు వచ్చాయని చెప్పారు.
అదంతా కేవలం ప్రొమోషన్స్ కోసం మాత్రమేనని,ఒరిజినల్ కలెక్షన్స్ కేవలం 140 నుండి 150 కోట్ల రూపాయిల మధ్యలోనే వచ్చిందని, ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఒకసారి పూర్తి స్థాయి బ్రేకప్ చూద్దాం.
తెలంగాణ ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా 18 కోట్ల రూపాయిల షేర్ వచ్చిందట. ఈ ప్రాంతం లో #RRR మొదటి రోజు రికార్డు బ్రేక్ అవుతుంది అనుకున్నారు కానీ, అది జరగలేదు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అయితే సీడెడ్ మినహా, మిగిలిన అన్నీ చోట్ల యావరేజి రేంజ్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 42 కోట్ల రూపాయిల షేర్, 80 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది. ఇక హిందీ లో దాదాపుగా 20 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చిందట. షారుఖ్ ఖాన్ డుంకీ చిత్రం పోటీ లో ఉన్నప్పటికీ సలార్ కి మంచి వసూళ్లు వచ్చాయనే చెప్పాలి.
కానీ తమిళం, కన్నడం మరియు మలయాళం వెర్షన్స్ కి పెద్దగా వసూళ్లు ఏమి రాలేదు. ఓవర్సీస్ లో మాత్రం దాదాపుగా 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొత్తానికి మంచి ఓపెనింగ్ దక్కింది కానీ, కాంబినేషన్ కి తగిన ఓపెనింగ్ కాదని పలువురి అభిప్రాయం.
కానీ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వంటి పండుగలు ఉండడం తో కచ్చితంగా ఈ చిత్రానికి లాంగ్ రన్ ఉంటుందని, వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. సంక్రాంతి వరకు కూడా రన్ ఉండొచ్చు అట , టాక్ మరియు రివ్యూస్ అదిరిపోయాయి కాబట్టి ఏదైనా జరగొచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.