‘పుష్ప2’ లో రాం చరణ్.. ట్విస్ట్ ఇచ్చిన చిత్ర యూనిట్..!

0
246

పాన్ వరల్డ్ మూవీ పుష్ప సీక్వెల్ ‘పుష్ప2’ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ హిట్లను తిరగరాస్తుంది. తక్కువ బడ్జెట్ లో టాలీవుడ్ ఇండస్ర్టీలో మాత్రమే రిలీజ్ చేసేందుకు సుకుమార్ తెరకెక్కించగా దానికి వచ్చిన క్రేజ్ ను చూసి చిత్ర యూనిట్ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంది.

ఏకంగా తమిళ్, కన్నడ, మలయాళ భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసింది. దీతో పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రంతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇండియా వ్యాప్తంగా ఈ మూవీ సృష్టించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్న వారి నుంచి ముదుసలి వరకూ తగ్గేదేలే అనే డైలాగ్ ను అంతలా వాడుతున్నారంటే ఈ మూవీని ఎంత మంది చూశారో అర్థం చేసుకోవచ్చు.

మరో వారంలో రెండో షెడ్యూల్ షూటింగ్

పుష్పకు సీక్వెల్ కూడా ఉండబోతోందని అప్పట్లోనే సుకుమార్ ప్రకటించారు. అందుకే లాస్ట్ లో ట్విస్ట్ తో పుష్పను ముగించారు. ఇక సీక్వెల్ పార్టులో పాత్రలపై ప్రతి రోజూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సీక్వెల్ లో కనిపించబోతున్నారంటూ న్యూస్ బాగా వైరల్ అయ్యింది. దీనిపై చిత్ర యూనిట్ ఇంత వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల మరో వార్త హల్ చల్ చేస్తోంది.

టాలీవుడ్ స్టార్ ఒకరు క్లైమాక్స్ లో ఈ మూవీలో కనిపించబోతున్నారంటూ ఇది మాత్రం సత్యం అంటూ కూడా హ్యాష్ ట్యాగ్ లో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. రష్యన్ లాంగ్వేజ్ లో డబ్ చేసుకున్న సినిమా ఇప్పుడు రష్యాలో బుధవారం (డిసెంబర్ 8)న రిలీజైంది. చిత్ర యూనిట్ ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్లారు. మొదటి షెడ్యూల్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన చిత్ర యూనిట్ రష్యా నుంచి వచ్చిన వెంటనే రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు. రెండో షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.

క్లైమాక్స్ లో చెర్రీ ఎంట్రీ

పుష్ప కు వచ్చిన హైప్ ను దృష్టిలో పెట్టుకొని పుష్ప 2 స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసినట్లు దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ప్రకటించారు కూడా. ఇందులో పాత్రలపై విపరీతమైన గాసిప్ లు వినిపిస్తున్నాయి. పుష్ప 2లో మరికొన్ని పాత్రలు యాడ్ అవుతాయని అందుకు తగిన నటులతో సంప్రదించామని కూడా చిత్ర యూనిట్ చెప్తూ వస్తోంది. ‘అందులో వీరుండబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పలువురి పేర్లను నెటిజన్లు షేర్ చేస్తూ వచ్చారు.’

ఇటీవల ఇలాంటి గాసిప్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పుష్ప 2 క్లైమాక్స్ లో రాం చరణ్ కనిపించబోతున్నట్లు వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. క్లైమాక్స్ లోని కొన్ని యాక్షన్ సీన్స్ లో చెర్రీ అల్లు అర్జున్ తో కలిసి చేయబోతున్నారట. దీనిపై ఇంకా చిత్ర యూనిట్ ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.