‘ముఖచిత్రం’ ఎలా ఉందంటే.. మూవీ రివ్యూ

0
281

వచ్చే వారం (డిసెంబర్ 16) భారీ చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ రిలీజ్ ఉండడంతో దానికి పోటీగా వచ్చే సినిమాలు నిలబడలేవని భావించిన ప్రొడ్యూసర్లు ఈ రోజే (డిసెంబర్ 9)న దాదాపు 17 చిత్రాలను రిలీజ్ చేశారు. అందులో కొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. శుక్రవారం రిలీజైన సినిమాల్లో ఒక చిత్రం ‘ముఖచిత్రం’ ఈ మూవీ ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.

ముఖచిత్రం సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యింది కూడా. ఈ చిత్రంపై సినీ అభిమానులు కూడా భిన్నంగా స్పందించారు. కోర్టు సీన్లను ప్రత్యేకంగాట్రైలర్ లో చూపించడంతో చాలా మందికి ఇక్కడే ఎంగేజింగ్ గా అనిపించింది. ఈ చిత్రానికి ‘కలర్ ఫొటో’లో జాతీయ స్థాయి అవార్డు అందుకున్న సందీప్ కథ, స్ర్కీన్ ప్లే అందించగా, ‘సినిమా బండి’లో నటించిన వికాస్ వశిష్ట ప్రధాన పాత్రలో కనిపించారు.

కథ విషయానికి వస్తే

రాజ్ కుమార్ (వికాస్ వశిష్ట) గుర్తింపు పొందిన ప్లాస్టిక్ సర్జన్. మహతి (ప్రియా వడ్లమాని) సంప్రదాయ విలువలు ఉన్న అమ్మాయి. పెళ్లిళ్ల బ్రోకర్ నుంచి మహతి ఫొటో రాజ్ కుమార్ వద్దకు వస్తుంది. దీంతో ఫొటోతోనే లవ్ ఇన్ ఫస్ట్ సైట్ అన్నట్లు రాజ్ కుమార్ ప్రేమలో పడతాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని నిర్ణయించుకుంటాడు. పెళ్లి చూపుల కోసం కూడా విజయవాడకు వస్తాడు. మహతీ కూడా రాజ్ కుమార్ తో పెళ్లికి ఓకే చెప్తుంది. ఇక పెళ్లి తంతు ముగుస్తుంది. వారి కాపురం సాగుతుండగా ఒక రోజు రాజ్ కుమార్ ఫ్రెండ్ మాయ (ఆయేషా ఖాన్) రోడ్డు ప్రమాదానికి గురవుతుంది.

ఇందులో ఆమె మొహానికి బాగా గాయాలవుతాయి. మాయ రోడ్డు ప్రమాదానిక గురైన తర్వాతి రోజు రాజ్ కుమార్ వైఫ్ మహతి మెట్లపై నుంచి కిందపడి చనిపోతుంది. అయితే మహతి మొహాన్ని మాయకు ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తాడు రాజ్ కుమార్. తర్వాత వారి జీవితాల్లో తిరిగిన మలుపుల నేపథ్యంలో సినిమా సాగుతుంది. అయితే మహతి మృతి చాలా అనుమానాలు కలుగుతాయి. సహజమేనా..? ఎవరైనా హత్య చేశారా..? ఈ ట్విస్ట్ ను సినిమాలో చూడాల్సిందే..

ముఖచిత్రం కథ షార్ట్ గా చెప్తే ఎంగేజింగ్ గా ఉన్నా. తెరకెక్కిడంలో దర్శకుడు తడబడ్డాడనే చెప్పాలి. సామాజిక సమస్యను కోర్టు డ్రామాగా మలచడం కొంత గందరగోళానికి గురి చేసింది. సినిమా ఫస్ట్ ఆఫ్ పాత్రల పరిచయం, పెళ్లి వీటితోనే సాగదీశారు. వీటిని కొంత తగ్గించాల్సి ఉంటే బాగుండేది. మాయ రోడ్డు ప్రమాదం, మహతి మృతి కథలో భారీ మలుపులకు కారణం. ఇక సెకెండ్ ఆఫ్ లో మహతి చావుకు కారణం తెలుస్తుంది.

తర్వాత కోర్టు డ్రామా నడుస్తుంది. లాయర్ గా విశ్వక్ సేన్ కనిపిస్తాడు. అయితే ఈ కోర్టు డ్రామాను తీయడంలో కూడా డైరెక్టర్ అనుకున్నంత మేర రాణించలేదనే టాక్ వినిపిస్తుంది. న్యాయవాదుల వాదనలు కూడా బలంగా లేవనిపిస్తుంది. విశ్వక్ సేన్ ప్రజంటేషన్ కొంత మేరకు బెటరనే చెప్పుకోవచ్చు. దాదాపు క్లైమాక్స్ కూడా ప్రేక్షకులకు తెలినట్టే ఉంటుంది.

ఎవరెలా చేశారంటే

వికాస్ తన నటనతో ఆకట్టకుకున్నాడు. మహతి పాత్రలో హీరోయిన్ ప్రియా వడ్లమాని గ్లామరస్ గా కనిపించింది. మాయగా అయేషా ఖాన్ మెప్పించింది. విశ్వక్ సేన్ చేసింది చిన్న పాత్రే అయినా ఆకట్టుకుంది. ఇంకా రవిశంకర్, మీర్, సునీల్, చైతన్య తమ పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పాలి.

నటీ నటులు.. వికాశ్ వశిష్ణ, ప్రయా వడ్లమాని, చైతన్యా రావు, అయేషా ఖాన్, విశ్వక్ సేన్.

కథ, స్ర్కీన్ ప్లే: సందీప్ రాజ్
దర్శకత్వం: గంగాధర్
ప్రొడ్యూసర్స్: ప్రదీప్ యాదవ్, యల్ల మోహన్
మ్యూజిక్: కాల భైరవ
ఎడిటింగ్: పవన్ కళ్యాణ్

టెక్నీషియన్స్

ఇందులోని పాటలు పెద్దగా అలరించలేదు. కానీ విశ్వక్ డైలాగులు మాత్రం గుర్తుండిపోతాయి. సామాజిక సమస్యను థ్రిల్లర్ కోణంలో చిత్రించడం మెచ్చుకోతగ్గదే. అది కూడా పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేదు.

ప్లస్ పాయింట్లు

చిత్రంలో వచ్చే ట్విస్ట్ లు.. నటీ, నటులు, కథా, కథా నేపథ్యం.

మైనస్ లు

సామాజిక నేపథ్యానికి, థ్రిల్లర్ కు ముడిపెట్టడం.
రక్తి కట్టించని డ్రామా
రొటీన్ ముగింపు
సంగీతం కూడా రాణించకపోవడం

రేటింగ్ : 2.5/5