గ్యాంగ్‌స్టర్ గా పవన్ కళ్యాణ్.. ఆ పోస్టర్ అదే చెప్తుందా..?

0
1416

పవన్ కళ్యాణ్ అంటేనే ట్రెండ్ సెట్టర్. ఆయనకు ఉన్న యూత్ ఫాలోవర్స్ మరే స్టార్ కు కూడా లేరు. ఆయన చేసిన సినిమాలు ప్రతి ఒక్కటీ మరో చిత్రానికి భిన్నమనే చెప్పాలి. పవర్ ఫుల్ పోలీస్ మ్యాన్, డీప్ లవర్, బాధ్యతలేని పర్సన్. ఇలా ప్రతి ఒక్కటీ వైవిధ్య భరితమే. సినిమాల నుంచి రాజకీయాల వరకూ ఆయన మూమెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ మరో రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్ధం అవుతున్నారంటా. అందుకు అన్నీ ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

సుజిత్ తో న్యూ ప్రాజెక్టు

అయితే ఈ మూవీలో ఆయన ఎలా కనిపించబోతున్నారంటూ ఫ్యాన్సే చెప్పాలంటూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను కూడా వదిలింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తతం క్రిష్ తో ‘హరిహర వీరమల్లు’ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పనన్ కళ్యాణ్. యంగ్ డైరెక్టర్ సుజిత్ కలిసి ఈ సనిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘డీవీవీ ఎంటర్ టైన్ మెంట్’ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ సినిమా పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పోస్టర్ ను పరిశీలిస్తే

పవన్ కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఇందులో పవన్ పాత్ర ఎలా ఉండబోతుందో గెస్ చేయాలంటూ ఫ్యాన్స్ బుర్రలకు పదును పెట్టింది. దీంతో ఆయన పాత్రపై భిన్నంగా కామెట్లుపెడుతున్నారు ఆయన ఫ్యాన్స్, సినీ అభిమానులు. ఈ పోస్టర్ లో చాలా విషయాలు దాగున్నాయి. దీన్ని వారు డీప్ గా పరిశీలిస్తున్నారు. పోస్టర్ పై రాసి ఉన్న ‘ది కాల్ హిం స్లాష్ ఓజీ’ అని ఉంది. ఇందులో ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగస్టర్ అని అర్థం వస్తుందట. పవన్ ఒక సర్కిల్ ముందు నిల్చొని ఉన్నాడు.

జెపాన్ జెండాగా

అది జెపాన్ జెండాగా కనిపిస్తుంది. అక్కడి దైవం బుద్ధుడి విగ్రహానికి పోస్టర్ లో స్థానం ఇచ్చారు. దీంతో పాటు గేట్ వే ఆఫ్ ఇండియా కూడా ఇందులో కనిపిస్తుంది. వీటిని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారని, జపాన్, ఇండియా దేశాలతో కనెక్ట్ అయి కథ ఉండబోతోందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

భారీ అంచనాలు

ఇక సుజిత్ దర్శకత్వంలో వచ్చే మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ‘హరిహర వీరమల్లు’ కూడా ఫ్యాన్స్ అంచనాలకు మించే ఉంటుందని క్రిష్ చెప్తున్నాడు. దీనికి సంబంధించి ఫైట్ సీన్ ఇది వరకే పూర్తి చేసుకోగా ఈ సీన్ సినిమాకే హైలట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక సుజిత్ మూవీలో గ్యాంగ్ స్టర్ అవతారంలో పవన్ ను ఊహించుకుంటున్న ఆయన అభిమానులు సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.