ప్రభాస్ విగ్గు వాడుతారా.. ఆయన జుట్టుపై వీడియో వైరల్..!

0
673

టాలీవుడ్ చిత్రసీమపై పరిచయం అక్కర్లేని పేరు ప్రభాస్. అవును మరి ఆయన తీసిన సినిమాలు ఆ రేంజ్ లో ఉంటాయి మరి. తన మొదటి సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమను షేక్ చేసిన ఈ యంగ్‌స్టార్ ‘వర్షం’తో తనలోని ప్రేమికుడిని బయటకు తీశాడు. ఆ తర్వాత వచ్చిన చాలా చిత్రాల్లో ఆయన నటించిన తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

టాలీవుడ్ ఇండస్ర్టీకి ఎన్నో బ్లాక్సాఫీస్ హిట్లను ఇచ్చిన ఘటత ఆయనకు సొంతం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ ఇటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హీలీవుడ్ రేంజ్ లో సత్తా చాటుతూ పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

పాన్ వరల్డ్ స్టార్ గా మారిన ప్రభాస్

బాహుబలి పాన్ వరల్డ్ రేంజ్ లో విజయం సొంతం చేసుకున్న తర్వాత ఆయన కెరీర్ లో మరింత దూసుకుపోయారు. భారీ బడ్జెట్ చిత్రాల్లో కూడా అలవోకగా నటించడం ఆయన ప్రత్యేకతే. బాహుబలి తర్వాత వచ్చిన ‘సాహో’, ‘రాథేశ్యాం’ కొంత డిజాస్టర్లుగా మిగిలినా ఆయన కెరీర్ కు మాత్రం అడ్డుగా నిలవలేదనే చెప్పాలి. బాహుబలి రేంజ్ లో ఆయనపై హోప్స్ పెట్టుకున్నందుకే ఈ రెండు సినిమాలు అంతగా ఆడలేదని టాక్ కూడా ఉంది.

వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ ట్రైలర్ గత దసరా వేడుకల్లో భాగంగా రిలీజైంది. ట్రైలర్ కు మంచి వ్యూవ్స్ వచ్చినా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ విషయంలో లోపాలను ఫ్యాన్స్ ఎత్తి చూపడంతో చిత్ర యూనిట్ మరోసారి వాటిపై కసరత్తు చేస్తుంది. ఆది పురుష్ షూటింగ్ చివరికి చేరుకున్నా విడుదలకు మరికొంత సమయం పడుతుందని చిత్ర యూనిట్ చెప్తుంది.

ప్రభాస్ జుట్టుపై వీడియో వైరల్

ఆది పురుష్ తో పాటు ‘సలార్’, ‘స్పిరిట్’ రెండు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు ప్రభాస్. వీటి షూటింగ్ కూడా వేగంగా సాగుతున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. చిత్ర విశేషాలను పక్కన బెడితే ప్రభాస్ గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ప్రభాస్ ది అసలైన జుట్టు కాదట.. ఆయన కూడా విగ్గు వాడుతారట.

ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను కూడా షేక్ చేస్తుంది. ప్రభాస్ అంటేనే ఒక భారీ కటౌట్. అంత అందానికి జుట్టే ముఖ్యం. లేడీ ఫ్యాన్స్ ఆయన క్రాఫ్ నే ఎక్కువగా ఆరాధిస్తారు. అలాంటి ప్రభాస్ కూడా విగ్గు వాడుతున్నారంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

గతంలో గాసిప్ లను కొట్టి పారేసిన మన హీరోలు

గతంలో మహేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్ విగ్గులు వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అది నిజం కాదని వారి మేకప్ మ్యాన్ లు క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి గాసిప్ లు కామనే అంటూ ఇద్దరు హీరోలు కూడా కొట్టి పారేసారు. కానీ ఇప్పుడు ప్రభాస్ కూడా విగ్గు వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇది పాతమే అయినా ఇప్పుడు లెటెస్ట్ వైరల్ గా మారింది.

ప్రభాస్ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది

ప్రభాస్ ది అసలు జుట్టు కాదని విగ్గే అంటూ గతంలో ఓ నెటిజన్ వీడియోను షేక్ చేశాడు. ఇది పాతదే అయినా ప్రస్తుతం చెక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక ఈవెంట్ లో పాల్గొన్న ప్రభాస్ కు ఆయన హెయిర్ స్టైలిస్ట్ జుట్టు సరి చేస్తున్నట్లు ఉంటుంది. హెయిర్ స్టైలిస్ట్ సరిచేస్తున్న విధానం చూస్తే నిజమైన విగ్గులాగే అనిపిస్తుంది. ప్రస్తుతం దీనిపై ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. నిజంగానే తమ అభిమాన హీరో విగ్గు వాడుతున్నారా..? అంటూ కామెంట్లుపెడుతున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ఆయన స్పందించాలి మరి.