శ్రీముఖి సినిమాల్లోకి రాకపోవడానికి కారణం ఆ డైరెక్టరే

0
241

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని కాస్టింగ్ కౌచ్ వేధిస్తోంది. చిత్ర సీమలో రాణించాలని ఎంతో ఆశతో వచ్చిన తారలు ఏదో ఒక చోట తీవ్ర ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. ఈ విషయాలు బయటకు వచ్చిన సమయంలో కొన్ని రోజులు రాద్ధాంతాలు చేసినా.. తర్వాత మాత్రం యథావిధి ఘటనలే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ చాలా మంది తారలు కూడా వీటికి తలొగ్గినట్లు సమాచారం.

వేళ్లూనుకుపోయిన కాస్టింగ్ కౌచ్

ఇండస్ట్రీలో అవకాశాలను పట్టుకోవడమే చాలా రిస్క్. ఒక్క టాలెంట్ మాత్రమే సరిపోదు. గతంలో నటీమణులకు టాలెంట్ ఒక్కటే కొలమానంగా ఉండేది. కానీ నేటి తరం నటీమణులకు దాంతో పాటు డైరెక్టర్, నిర్మాత, హీరోను కూడా సాటిఫై చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తే ఒకే.. కానీ బయటి నుంచి వస్తే మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు నేటి తరం తారలు. చేసేది లేక కాస్టింగ్ కౌచ్ ను కూడా చాలా లైట్ గా తీసుకుంటున్నారు నేటి తరం వారు. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ఈ సంప్రదాయం లేకున్నా.. మెల్లమెల్లగా ఇది ఇక్కడకు కూడా పాకి ప్రస్తుతం పాతుకుపోయిందనే చెప్పక తప్పదు..

బుల్లి తెర తారలకు తప్పని కాస్టింగ్ కౌచ్

ఇందులో స్టార్ హీరోయిన్లతో పాటు బుల్లితెర నుంచి వెళ్లిన నటీమణులు కూడా ఉండడం గమనార్హమే. ఒక స్టార్ యాంకర్ కు కూడా ఈ దుస్థితి ఎదురైందట. వెండితెరపై ఒక వెలుగు వెలగాలని లక్ష్యంగా పెట్టుకున్న సదరు యాంకర్ కాస్టింగ్ కౌచ్ కు గురైందట. అప్పటి నుంచి ఆమె సినిమాల్లో చేయనని చెప్పిందట. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కాస్టింగ్ కౌచ్ కు గురైన శ్రీముఖి

ప్రముఖ స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి పరిచయం అక్కర్లేదు. బుల్లితెర రాములమ్మగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోకి కూడా వెళ్లాలనుకుంది. కొన్ని చిన్న చిన్న పాత్రలు కూడా వేసింది. ఇటీవల ఒక డైరెక్టర్ తో ఒక సినిమా విషయం చర్చించేందుకు రూమ్ కు రమ్మనాడట. కథపై చర్చ ఉంటుందని అనుకొని ఆమె వెళ్లిదంట. దీంతో అక్కడ ఆయన వల్గర్ గా మాట్లాడడంతో పాటు ప్రవర్తించడంతో చిరకుపడ్డ శ్రీముఖి బయటకు వచ్చింది. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలికి బుల్లితెరపై షోలు, ఈవెంట్లు చేస్తూ గడిపేస్తుంది. కొన్ని సందర్భాలలో కాస్టింగ్ కౌచ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు శ్రీముఖి.

సినీ పెద్దలు పట్టించుకోవాలి

కాస్టింగ్ కౌచ్ నుంచి ఇండస్ట్రీ బయట పడ్డప్పుడు మాత్రమే మంచి మంచి నటులు ఎంట్రీ ఇస్తారని చాలా సందర్భాల్లో చాలా మంది నటీమణులు చెప్తూనే ఉన్నారు. కాస్టింగ్ కౌచ్ పై నిరసనలు, ధర్నాలు కూడా ఇండస్ట్రీకి కొత్తేమి కాదు. దీనిపై సినీ ప్రముఖులు పట్టించుకోవాలని ఉక్కుపాదంతో అణచివేయాలని కోరుతున్నా కాస్టింగ్ కౌచ్ మాత్రం మరిన్ని వేర్లు పూనుకుంటూ బలంగా మారుతుందని నటీమణులు వాపోతున్నారు. ఇది అప్ కమింగ్ హీరోయిన్స్ కు ఇబ్బంది కలిగిస్తుందని చెప్తున్నారు.