జేడీ అబద్దాల కోరు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన రంభ

0
261

విజయవాడలో విజయలక్ష్మిగా పుట్టిన అమ్మాయి చిత్ర సీమలో రంభగా మారి అనేక చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం జనరేషన్ కు ఆమె తెలియకపోవచ్చు కానీ ఓ 20 సంవత్సరాల ముందు వారికి ఆమెపై ఉన్న క్రేజ్ తెలిసే ఉంటుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ ఆమె నటించి మెప్పించింది. బబ్లీ, గ్లామరస్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె అమాయకపు, అల్లరిపిల్లగా కూడా కనిపించి మెప్పించింది.

ఆమెతో తెలుగుతో పాటు వివిధ ఇండస్ట్రీల్లో కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. రాను రాను ఛాన్స్ లు తగ్గుతుండడంతో ఐటెం గర్ల్ గా కూడా నటించారు. తర్వాత వివాహం చేసుకొని సెటిలైపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి గురించి షాకింగ్ విషయాలు చెప్పింది రంభ.

1992లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ

1992లో వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రంభ అనేక చిత్రాల్లో నటించారు. చిరంజీవితో ‘అల్లుడా మజాకా’, ‘బావగారూ బాగున్నారా’ లాంటి సినిమాలను కూడా చేశారు. వెంకటేశ్, నాగార్జునతో పాటు చాలా మంది హీరోలతో నటించారు రంభ. ఎంత మంది హీరోలతో చేసినా జేడీ చక్రవర్తితో చేసిన సినిమాలు ప్రత్యేకమనే చెప్పాలి.

‘బొంబాయి ప్రియుడు’, ‘కోదండ రాముడు’తో పాటు మరికొన్ని మూవీస్ లో ఆయనతో ఆమె నటించింది. వీరి పెయిర్ అప్పట్లో హిట్ గా నిలిచేది. దీంతో వీరి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. ఈ నేపథ్యంలోనే జేడీ చక్రవర్తిపై పలు ఆసక్తి కర విషయాలను చెప్పింది రంభ. ఆమె మాటల్లోనే చూద్దాం.

జేడీపై సంచలన వ్యాఖ్యలు

‘జేడీ చక్రవర్తి నేను చాలా క్లోజ్.. సినిమాలలో మా పెయిర్ కు క్రేజ్ ఉండేది. జేడీ ఉన్నాడంటే రంభ ఉండాల్సిందే అంటూ ఫ్యాన్స్ కోరుకునేవారు. అప్పటి డైరెక్టర్లు కూడా మా పెయిర్ ను ఎక్కువగా తీసుకునే వారు. జేడీ చక్రవర్తి ఫ్రెండ్ షిప్ మెయింటెనెన్స్ చేసే విషయంలో చాలా అబద్ధాల కోరు.’ అంటూ చెప్పింది.

ఫ్యామలీ లైఫ్ ను ఆస్వాదిస్తున్న రంభ

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న రంభ ఫ్యామిలీ లైఫ్ ను ఆస్వాదిస్తుందట. త్వరలోనే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని అనుకుంటున్నా అంటూ చెప్తుకచ్చింది. పూర్తిగా సినిమా ఇండస్ట్రీతో లింక్ తెగకుండా చూసుకుంటుంది ఈ బ్యూటీ. జూనియర్ ఎన్టీఆర్ తో ‘నాగ’ సినిమా, అల్లు అర్జున్ ‘దేశముదురు’లో ఐటం సాంగ్స్ కూడా చేసింది. మంచి కథలతో వస్తే మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్తుంది.

రంభ సెకండ్ ఇన్నింగ్స్ ప్రయత్నాలపై వస్తున్న వార్తలను కూడా స్వాగతించింది. ఇప్పుడు వస్తున్న సినిమాలు చాలా బాగున్నాయని, గత చిత్రాలతో పోల్చుకుంటే ఇవి మరింత టెక్నికల్ గా సాగుతూ పాన్ వరల్డ్ వైడ్ గ్రాఫ్ ను సంపాదించుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది. ఇవన్నీ పక్కన బెడితే జేడీపై ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.