రెమ్యునరేషన్ లో ఐకాన్ స్టార్ ఫస్ట్ ప్లేస్ గ్యారంటీ

0
221

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ బిఫోర్ పుష్ప.. ఆఫ్టర్ పుష్ప అన్నట్లుగా ఉంది. పుష్ప పాన్ ఇండియా రేంజ్ ను దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్లడంతో ఆయనకు టాలీవుడ్ లో క్రేజ్ ఎక్కువైంది. ఇటీవల పుష్ప ను రష్యన్ భాషలో ఆదేశంలో రిలీజ్ చేశారు. మంచి టాక్ తోనూ దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టాలీవుడ్ లో కూడా ఐకాన్ స్టార్ రేంజ్ దానికంటే డబుల్ గా ఉంది. ఇక పుష్ప 2 షూటింగ్ కొనసగుతుండడంతో దానిపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

పాన్ ఇండియాలో సక్సెస్ సాధించిన పుష్ప

సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్ బ్యానర్ పై వచ్చిన సినిమా పుష్ప మొదట ఈ సినిమాను ఒక టాలీవుడ్ కు మాత్రమే పరిమితం చేయాలనుకున్న సుకుమార్ దీనికి వచ్చిన టాక్ ను దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ కు ప్లాన్ చేశారు. దీంతో వివిధ భాషల్లో పలు ఇండస్ట్రీలలో ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టింది.

ఇటీవల కేరళలో కూడా పుష్పను రీ-రిలీజ్ చేశారు. అక్కడ ఉన్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఈ మూవీ రీ రిలీజ్ కు భారీగానే ప్లాన్స్ కూడా చేశారు. ఈ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు అంతా అల్లు అర్జున్ రెమ్యునరేషన్ పై ఇండస్ట్రీలో చర్చ జోరుగా కొనసాగుతుంది. అల్లు వారబ్బాయి పారితోషికం విషయంలో పట్టు సడలించడం లేదట.

లాభాల్లో వాటా కోరుతున్న ఐకాన్ స్టార్

పుష్ప అంచనాలకు మించి విజయం దక్కించుకోవడంతో పుష్ప 2కు సంబంధించి ఆయన లాభాల్లో వాటాను అడుగుతున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. పుష్ప 2 కు దాదాపు రూ. 100 కోట్లు పారితోషికం తీసుకోవడంతో పాటు సినిమా రాబట్టే వాసూళ్లలో 30 శాతం వరకూ వాటాను ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్లు టాక్ ఉంది. హిందీ హక్కుల కోసం భారీ మొత్తంలో మైత్రీ మూవీ మేకర్స్ వసూలు చేస్తుండడంతో ఈ వాటాను అల్లు అర్జున్ కావాలని కోరినట్లు సమాచారం.

పారితోషికంతో పాటు వాటాల్లో లాభాలు కూడా తీసుకుంటే దాదాపు రూ. 130 కోట్ల వరకూ అల్లు అర్జున్ ఆదాయం సమకూరుతుందని ఇండస్ట్రీ భావిస్తోంది. ఇదే కనుక నిజమైతే అల్లు అర్జున్ అతి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో మొదటి స్థానంలో నిలుస్తారు.

రెమ్యునరేషన్ విషయంలో ఫస్ట్ ప్లేస్

ఇప్పటి వరకూ ప్రభాస్ బాహుబలి 2, యష్ కేజీఎఫ్ 2 సరసన పుష్ప 2 కూడా చేరనుంది. ఆ సినిమాలకు ఆ హీరోల రెమ్యునరేషన్ తో పోల్చుకుంటే అల్లు అర్జున్ ఎక్కువగానే వసూలు చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ షరతులకు మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం నో చెప్తోంది. అర్జున్ కంటే భారీ స్టార్ తో ఈ బ్యానర్ అనేక సినిమాలు నిర్మంచింది. వారికి తలొగ్గని మైత్రీ అల్లు అర్జున్ కు ఓకే చెప్తుందా..? అన్న సందేహాలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.