హీరో, హీరోయిన్ కు మూడ్ తెప్పించిన ఆ డైరెక్టర్

0
195

విశ్వ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళం, కన్నడ, తెలుగు, హిందీ.. ఇలా చాలా భాషల్లో ఆయన ఎన్నో సినిమాల్లో నటిస్తూ నట విశ్వరూపం చూపించారు. ఆయన కెరీర్ లో ఆల్ టైం హిట్లుగా కొన్ని సినిమాలు మిగిలాయి. అందులో తెలుగులో వచ్చినవి పరిశీలిస్తే స్వాతిముత్యం, సాగర సంగమం. ఇందులోని పాత్రల్లో ఆయన ఒదిగిపోయిన తీరు ఆశ్చర్యానికి గురి చేయక మానదు. ఇందులో స్వాతిముత్యం అప్పట్లో ఆస్కార్ కు సైతం నామినేట్ అయ్యిందంటే ఆ మూవీ సాధించిన సంచలనాలు ఏ మేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

వసూళ్లు కురిపించిన స్వాతిముత్యం

కళాతపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రాధిక హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా వసూళ్లలో సంచలనాలు సాధించిందనే చెప్పాలి. అమాయకపు చక్రవర్తిగా కమల్ హాసన్ నటనా విశ్వరూపం ప్రదర్శించారు. ఈ చిత్రంతో కమల్ హాసన్ కమర్షియల్ హీరోగా తెలుగులో స్థిరపడిపోయారనే చెప్పాలి. ఈ మూవీలో కమల్ నటన ఇండస్ట్రీలోని కొంత మంది హీరోలకు బాగా నచ్చిందట. ఆయనను ఇమిటేట్ చేసేందుకు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆరాధనలో నటించారు కానీ కమల్ హాసన్ అంత పర్ఫా ర్మెన్స్ చూపించలేకపోయారని తెలుస్తోంది.

స్వాతిముత్యంతో స్టార్ డైరెక్టర్ల సరసన విశ్వనాథ్

స్వాతిముత్యం కే విశ్వనాథ్ ను కూడా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ల సరసన చేర్చింది. అప్పట్లో విశ్వనాథ్ సినిమా అంటే అదొక కళాకండంగా భావించే వారు. స్వాతిముత్యంను కూడా అందరూ అలాగే భావించడంతో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ తో పాటు వివిధ ఇండస్ట్రీలలో కే విశ్వనాథ్ పేరు మారుమోగింది. ఈ సినిమా ఎన్నో అవార్డులు రివార్డులు దక్కించుకుంది. కమల్ తో పోటీ పడి మరీ రాధిక కూడా నటించింది. ఇందులో ఒక పాటకు సంబంధించి రొమాన్స్ విషయంలో రాధిక, కమల్ మొహమాట పడ్డారట. అప్పుడు దర్శకుడు విశ్వనాథ్ ఒక పని చేశారట.

పర్ఫ్యూమ్ తో మ్యానేజ్ చేసిన కళాతపస్వి

ఈ సినిమాకు సంబంధించి ఒక సాంగ్ చేసే సమయంలో రొమాంటిక్ సీన్ వచ్చిందట. సాధారణంగా కమల్ హాసన్ నటన గురించి మనకు తెలుసు. కానీ కళాతపస్వి విశ్వనాథ్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్స్ పెక్ట్ చేయని హీరో, హీరోయిన్స్ ఈ సీన్ వచ్చే సరికి తటపటాయించారట. దీంతో టేకుల మీద టేకులు తీసుకోవాల్సి వచ్చిందట.

ఇక చేసేది లేక విశ్వనాథ్ రాధికను పిలిపించుకొని ఆమె మీద ఒక పర్‌ఫ్యూమ్ చల్లారు. కమల్ హాసన్ కు రొమాంటిక్ ఫీల్ వచ్చేలా చేశారట. ఇక ఆ తర్వాత ఒక్క టేక్ లోనే సీన్ బాగా వచ్చింది. ఈ విషయంలో కమల్ హాసన్ రాధికను అపార్థం కూడా చేసుకున్నారట. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలను రాధికనే స్వయంగా వెల్లడించారు.