రొమాంటిక్ సీన్స్ లో హీరోలందరూ అలా చేస్తారు

0
219

అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా భాటియా. మిల్కీ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకున్న తమన్నా ‘శ్రీ’ సినిమాతో ఇండస్ర్టీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘హ్యాపీడేస్’ ఆమెకు మరింత గుర్తింపు ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె ప్రయాణం మనందరికీ తెలిసిందే. స్టార్ హీరోల సరసన చేస్తూ హ్యాట్రిక్ హిట్లు కూడా అందించింది ఆమె. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 18 సంవత్సరాలు గడిచింది.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా నటించింది. కొంత కాలం ఆమెకు అనుకున్న ప్రాజెక్టులు రాకపోవడంతో ఓటీటీలో చెఫ్ ప్రొగ్రామ్ లో కనిపించి అలరించింది. ఇటీవల ఎఫ్2, ఎఫ్3 లాంటి సినిమాలు హిట్ కావడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది మిల్కీబ్యూటీ.

నిరాశ పరుస్తున్న సినిమాలు

ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన బబ్లీ బౌన్సర్ తో పాటు టాలీవుడ్ లో వచ్చిన శీతాకాంల గుర్తుందా వంటి సినిమాలు డిజాస్టర్ ను మిగిల్చాయి. ఆమె అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. గత తమన్నా కావాలంటూ కామెంట్లు చేశారు. పూర్వ బైభవానికి ఆమె చాలానే కష్టపడాల్సి ఉంటుందని సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. కెరీర్ గాడిన పడుతున్న సమయంలో వచ్చిన సినిమాలు ఆమెను తీవ్రంగా నిరాశకు గురి చేయడంతో మళ్లీ పాతాళంలోకి వెళ్లిన తమన్నా. మెల్లమెల్లగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నా సరైన ప్రాజెక్టులు దొరకక కష్టపడుతుందనే చెప్పక తప్పదు.

తమన్నా చేతిలో ఒకే ప్రాజెక్టు

మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో ఆమె నటిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఒక్క ప్రాజెక్టు తప్ప తమన్నా చేతిలో మరెలాంటి ప్రాజెక్టులు లేవు. ఈ సినిమా షూటింగ్ పూర్తియి రిలీజ్ అయిన తర్వాత ఆమెకు వచ్చే గుర్తింపును బట్టే తర్వాతి సినిమాలు ఉంటాయని తెలుస్తోంది. అప్పటి వరకూ అమ్మడు ఖాళీగానే ఉండకతప్పదు మరి. ఇవన్నీ ఇలా ఉన్నా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమ్మడు కొన్ని షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

ఆ సీన్స్ లో హీరోలు కూడా మొహమాట పడుతారు

‘సినిమాల్లో హీరో, హీరోయిన్ రొమాంటిక్ సీన్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటారు. కానీ ఆ సన్నివేశాల్లో నటించేప్పుడు ఎవరు ఎంజాయ్ చేస్తారో.. ఎవరు చేయరో.. నాకు తెలుసు. అలాంటి సీన్స్ చేసేప్పుడు హీరోయిన్స్ ఎలా ఇబ్బంది పడతారో హీరోలు కూడా అలానే ఇబ్బంది పడతారు. వారి మొహమాటం వల్ల చాలా టేక్స్ తీసుకోవాల్సి వస్తుంది. కొందరు హీరోలైతే అలాంటి సీన్స్ చేసేప్పుడు కనీసం హీరోయిన్స్ తో కూడా మాట్లాడరు.

ఇండస్ట్రీలో చాలా మంది రొమాంటిక్ సీన్స్ ను ఎక్కువగా ఇష్టపడరు. కానీ బయట సమాజం మాత్రం హీరోయిన్స్ తో హీరోలు తెగ ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు. కానీ ఇక్కడి వాస్తవ పరిస్థితులు వారికి తెలియవు.’ రొమాంటిక్ సీన్స్ లో కూడా స్పందించని హీరోలు ఎవరంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. వారెవరనే విషయం మాత్రం అమ్మడు బయట పెట్టడం లేదు.