కూతుళ్ల కోసం ఏ తండ్రీ చేయని పని చేసిన చలపతిరావు

0
286

చలపతి రావు ఇటీవల మరణించి టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని విషాదం మిగిల్చారు. ఈ మధ్య కాలంలో చాలా మంది సీనియర్ నటులు వరుసగా మరణిస్తున్నారు. దీంతో ఇండస్ట్రీ పెద్ద దిక్కులను కోల్పోతూ సతమతం అవుతుంది. ప్రకృతి కార్యమే అయినా వారి మరణం మాత్రం ఎంతో మంది అభిమానులు, వివిధ ఇండస్ట్రీల పెద్దలకు తీరని ధు:ఖమనే చెప్పాలి. కృష్ణంరాజు, కృష్ణ, చలపతిరావు, కైకాల సత్యనారాయణ ఇలా చాలా మంది మరణ వార్తలు విన్న ఇండస్ట్రీ కుంగిపోతుంది.

గత ఇంటర్వ్యూలలో విషయాలను షేర్ చేస్తున్న అభిమానులు

ఇటీవల మరణించిన చలపతి రావు గురించి తెలుసుకునేందుకు ఆయన అభిమానులు, సీనీ అభిమానులు నెట్టింట్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను ఆయన చెప్పిన ఇంటర్వ్యూలోని విశేషాలను వైరల్ చేస్తున్నారు. అందులో కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తన ఇద్దరు కూతుళ్ల విషయంలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

పిల్లలు వెల్ సెటిల్ అయ్యారు

చలపతి రావు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలు పెట్టారు. తర్వాత విలన్, కమేడియన్ ఇలా అనేక పాత్రల్లో కనిపించి మెప్పించారు. దాదాపు 700కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన కొన్ని చిత్రాలను కూడా నిర్మించారు. ఆయన కొడుకు రవిబాబు తీసిన సినిమాల్లో కూడా ఆయన నటించారు. ఆయన బతికున్న సమయంలో తన జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలను అభిమానులతో పంచుకున్నారు. ఆ విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రెండో పెళ్లి అందుకే చేసుకోలేదు

‘పిల్లలు చిన్నతనంలో ఉండగానే నా భార్య మరణించింది. అప్పటి నుంచి రెండో పెళ్లి చేసుకోకుండా వారి కోసమే జీవితాన్ని వెచ్చించాను. రెండో పెళ్లి చేసుకుంటే వచ్చేది వారిని సరిగా చూసుకోదని అనుకునే దూరంగా ఉన్నాను. వారి కోసం ఆస్తి పాస్తులు కూడబెట్టకపోవచ్చు. కానీ మంచి భవిష్యత్ ఇవ్వాలని తపన మాత్రం ఉండేది. ప్రస్తుతం ఇద్దరు కూతుళ్లు అమెరికాలో చదువుకొని అక్కడే సెటిల్ అయ్యారు. ఒక రోజు రెండో కూతురు మాలిని దేవి ఫోన్ చేసి మిచ్ గన్ యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ ర్యాంక్ సాధించాను అని చెప్పింది.

దీంతో నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తను అనుకున్న కల నెరవేరుతుందని ఆనందపడ్డాను. చాలా గర్వంగా అనిపించింది. ప్రతీ సంవత్సరం ఎనిమిది నెలలు సినిమాల్లో నటిస్తే మిగిలిన నాలుగు నెలలు చెరో రెండు నెలల చొప్పున వారింట్లో గడుపుతుంటారు. మనుమళ్లు, మనుమరాళ్లతో ఆనందంగా అనిపిస్తుంది.

దగ్గరుండి శ్రీమంతం చేయించిన చలపతిరావు

వారికి తల్లిలేని లోటు తీర్చాలని ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాను. నా కూతుళ్లు కడుపుతో ఉండగా నేనే దగ్గరుండి శ్రీమంతం చేయించాను. అలా ఎన్నో కర్యాలను దగ్గరుండి చూసుకున్నారు. పిల్లలందరూ వారికి ఇష్టమైన వృత్తిలో, ఇష్టమైన చోట స్తిపడ్డారు. అందరినీ చూస్తుంటే కడుపునిండినట్లు అనిపిస్తుంది.’ ఇలా చాలా విషయాలను ఇంటర్వ్యూ వివరించారు చలపతి రావు. ఆయన చేసిన పనులను విన్న అభిమానులు సార్ నువ్వు చాలా గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.