ప్రభాస్ ‘కల్కి’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పబోతున్న డైరెక్టర్ నాగ అశ్విన్!

0
295
Director Naga Ashwin is going to tell interesting things about Prabhas Kalki movie

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’.

మహానటి ఫేమ్ నాగ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ సుమారుగా 600 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన మొదటి గ్లిమ్స్ వీడియో విడుదల చెయ్యగా, దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరం చూసాము. హాలీవుడ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ఈ గ్లిమ్స్ ని చూస్తే అర్థం అవుతుంది.

ఈ చిత్ర కథ టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద మహాభారతం కాలం లోని కొన్ని పాత్రలను ఆధారంగా తీసుకొని రూపొందించిన కథ అని, ఇందులో ప్రభాస్ శ్రీ మహా విష్ణువు 11 వ అవతారం కల్కి గా కనిపించబోతున్నాడనే విషయం మాత్రమే మనకి తెలుసు.

Salaar Movie how much more revenue to break even

ఇంకా ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవాలని ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ లో కూడా ఉంది. అలాంటి వారి కోసమే ఈ చిత్ర డైరెక్టర్ నాగ అశ్విన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఐఐటీ బాంబే టెక్ ఫస్ట్ 2023 లో పాల్గొనబోతున్న నాగ అశ్విన్ కన్వెన్షన్ హాల్ లో స్టూడెంట్స్ తో ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసాడు. ఈ మీటింగ్ లో ఆయన కల్కి సినిమా గురించి ఎవరికీ తెలియని విషయాలను మొత్తం పంచుకోబోతున్నాడు.

ఒక పక్క సలార్ సక్సెస్ ని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ కి ఈ న్యూస్ వాళ్ళని మరింత ఖుషి అయ్యేలా చేసింది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో , యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ రోల్ లో నటించబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే.

దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్ మరియు దిషా పటాని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ప్రభాస్ మరియు ఇతర తారాగణం కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిందట. కేవలం కమల్ హాసన్ కి సంబంధించిన సన్నివేశాలు, అలాగే ప్రభాస్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్ కి సంబంధించిన సన్నివేశాల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. వచ్చే ఏడాది లోనే ఈ సినిమాని విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.