ఈ విషయం విని ఏడ్చేసిన సురేఖ, చిరంజీవి

0
238

చిత్ర ప్రపంచంలో అగ్ర నటుడిగా గుర్తింపు దక్కించుకున్న చిరంజీవి గురించి పరిచయం అవసరం లేదు. కొణిదెల శివ శంకర వరప్రసాద్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆయన మెగాస్టార్ చిరంజీవిగా మారే వరకూ ఆయన కృషి అనిర్వచనీయం. సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి మెగాస్టార్ గా మారి దేశం యావత్తు గుర్తింపు దక్కించుకున్న నటుడిగా ఎదిగారు. ఇప్పటికీ బ్లాక్ బస్టర్ సినిమాలను చేస్తూనే ఇండస్ట్రీకి పెద్దన్నగా నిలుస్తున్నారు. చాలా మంది దర్శకులను, ప్రొడ్యూసర్లును, హీరోయిన్లను ఆయన చిత్ర సీమకు పరిచయం చేశారు. ఆయన కొడుకు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నాడనంలో సందేహమే లేదు.

ఏడ్చేసిన చిరంజీవి-సురేఖ

ఒంటిరి వ్యక్తిగా ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవికి అనతి కాలంలోనే స్టార్ డమ్ దక్కలేదు. మొదట చిన్న చిన్న పాత్రలు వేశారు. ఆ తర్వాత విలన్ గా కూడా చేశారు. ఆ తర్వాతనే ఆయన హీరోగా మారి అనేక సినిమాలలో అభిమానులను అలరించారు. ఆయన జీవితం ఆరు దశాబ్ధాలకు పైగా ఇండస్ట్రీతో పెనవేసుకుంది. ఇన్నేళ్ల జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డా ఆయన కన్నీరు పెట్టలేదు. కానీ రీసెంగ్ గా జరిగిన ఒక ఘటన మాత్రం ఆయనకు కన్నీరు తెచ్చిపెట్టిందట. తన భార్య సురేఖతో పాటు ఆయన కూడా కలిసి ఏడ్చేశారట. అయితే అదేదో కష్టం అనుకుంటే పొరబాటే.. ఆనంద బాష్పాలండోయ్.. ఎందుకో చూద్దాం.. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు.

రామ్ చరణ్ తో ఉపాసనకు వివాహం

చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ అనతి కాలంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తెచ్చిన పెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఈ సినిమాలో స్ర్కీన్ పంచుకున్నారు. ఇవన్నీ పక్కనబెడితే రామ్ చరణ్ తో ఉపాసనకు వివాహం జరిగి దాదాపు పదేళ్లు గడిచాయి. అయినా పిల్లలు లేరు. ఈయనతో పాటు వివాహమైన ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబులకు పిల్లలు ఉన్నారు. కానీ పదేళ్లయినా వీరికి పిల్లలు కాకపోవడంతో చాలా కాలం బాధపడ్డారట చిరంజీవి దంపతులు. కానీ ఎప్పుడూ కూడా ఉపాసనను గానీ, రామ్ చరణ్ ను గానీ ఒక్క మాట కూడా అనలేదట.

ఉపాసన చెప్పినప్పుడు బాగా ఆనంద పడ్డాను

‘ఇటీవల ఉపాసన తను తల్లికాబోతున్నట్లు తెలిపినప్పుడు చాలా సంతోషపడ్డారట. ఈ విషయాన్ని నా అభిమానులకు మూడు నెలల తర్వాత పంచుకోవాలనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. మొదట నా భార్య సురేఖ నేను బాగా ఏడ్చేశాము.. పదేళ్ల తర్వాత ఇంత పెద్ద గుడ్ న్యూస్ విన్నాం. ఇది మా కుటుంబానికి పెద్ద న్యూసనే చెప్పాలి. తన ఇంటి నుంచి వారసుడో, వారసురాలో రాబోతున్నారంటేనే ఆనందం మాటలకు అందదు’. ఇలా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకచ్చారు చిరంజీవి. మెగాఫ్యాన్స్ కు ఇప్పుడు చిరంజీవి మాటలను బాగా వైరల్ చేస్తున్నారు.