కళ్యాణ్ దేవ్ కూడా మరో ఉదయ్ కిరణ్ కానున్నాడా..?

0
242

మెగాస్టార్ అల్లుడి గుర్తింపుతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కళ్యాణ్ దేవ్. ఆయన ఎవరో తెలియకున్నా మెగా ఫ్యాన్స్ ఆయనను ఆకాశానికి ఎత్తారు. దీంతో ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉండేవారు. కానీ ఇప్పుడు కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీలో కనిపించకుండా పోయారు. ఇక ఆయన కూడా మరో ఉదయ్ కిరణ్ అవుతారన్న చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడిపోవడమే కారణం

మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ కళ్యాణ్ దేవ్ ను రెండో వివాహం చేసుకుంది. శ్రీజ మొదటి వివాహం ఒక బ్రాహ్మణ వ్యక్తి శిరీష్ భరద్వాజ్ తో జరిగింది. వారి దాంపత్యంలో ఒక కూతురు కూడా పుట్టింది. తర్వాత వివిధ కారణాలతో ఆమె అతనికి విడాకులు ఇచ్చింది. పుట్టింటికి వచ్చిన ఆమెకు కళ్యాణ్ దేవ్ తో వివాహం జరిపించారు చిరంజీవి. కళ్యాణ్ దేవ్ కు కూడా ఇది రెండో వివాహమే. చిరంజీవి అల్లుడిగా మారిన కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీలోకి వచ్చారు.

విజేత సినిమాతో ఆయన టాలీవుడ్ లో అరంగేట్రం చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయినా మెగా ఫ్యాన్స్ మాత్రం కళ్యాణ్ దేవ్ కు మంచి గుర్తింపును ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో కూడా కనిపించారు కళ్యాణ్ దేవ్. ఇటీవల ఆయన ‘సూపర్ మచ్చి’ అనే సినిమాలో కూడా కనిపించారు. ఈ సినిమా ఒకటి ఉందని ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదంటే గమనార్హమే. కారణం ఏంటంటే.. శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోవడమే కావచ్చు అంటున్నారు మెగా నెగెటివ్ ఫ్యాన్స్.

ఫ్లాప్ లతో ఇక్కట్లు ఎదుర్కొన్న ఉదయ్ కిరణ్

శ్రీజ ఉదయ్ కిరణ్ ను వివాహం చేసుకుంటుంది. ఈ వార్తలు వ్యాపిస్తున్న సమయంలో ఉదయ్ కిరణ్ స్టార్ డమ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. కారణం ఏదైనా కావచ్చు కానీ ఉదయ్ కిరణ్ శ్రీజను వివాహం చేసుకోలేదు. దీంతో ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలో కనిపించకుండా పోయారు. అంతటి స్టార్ డమ్ సంపాదించుకున్న నటుడు అనతి కాలంలో ఫ్లాప్ సినిమాలతో ఇండస్ట్రీలో పత్తా లేకుండా పోవడంపై అనేక గాసిప్ లు బయటకు వచ్చాయి. ఇప్పుడు కళ్యాణ్ దేవ్ వంతు అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ కూడా ఇండస్ట్రీలో ఇప్పుడు కనిపించడం లేదు. కారణం శ్రీజను ఆయన విడిచిపెట్టాడనే కారణం కావచ్చు.

ఇన్ స్టాలో పేరును తొలగించిన శ్రీజ

ఇటీవల శ్రీజ తన ఇన్ స్టా అకౌంట్ లో కళ్యాణ్ దేవ్ పేరును తొలగించింది. చాలా కాలంగా ఆమె పుట్టింట్లోనే ఉంటుంది. శ్రీజను కళ్యాణ్ దేవ్ విడిచిపెట్టడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఆయనను పట్టించుకోవడం మానేశారు. సొంత కాళ్లపై నిలదొక్కుకోలేకపోయిన కళ్యాణ్ దేవ్ మెగా ట్యాగ్ తో ఇండస్ట్రీలోకి రావడమే ఆయన పతనానికి కారణం అంటూ వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో వీరికి విడాకులు తప్పవని గాసిప్ లు వస్తున్న నేపథ్యంలో ఉదయ్ కిరణ్ లాగానే కళ్యాణ్ దేవ్ కూడా మారుతారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.