ప్రభాస్ దెబ్బ.. అన్ స్టాపబుల్ అబ్బా

0
215

బాలయ్య బాబుతో ఆహా చేస్తున్న షో ‘అన్ స్టాపబుల్’. మొదటి సీజన్ తో ఓటీటీని షేక్ చేసిన బాలకృష్ణ సీజన్ 2తో మరింత ధుమ్ము రేపుతున్నారు. ‘అన్ స్టాపబుల్ ఎన్ బీకే-2’ మొదటి ఎపీసోడ్ నుంచి కొత్త స్టయిల్ లో దూసుకుపోతోంది. సీజన్ 2 ప్రారంభంలోనే పొలిటికల్ ఇమేజ్ కట్టబెట్టారు బాలయ్య. తన బావ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని తీసుకచ్చారు. ఫ్యామిలీ ముచ్చట్లు, పార్టీ విశేషాలు, తన తండ్రితో బావకు ఉన్న సంబంధాలు ఇవన్నీ కండ్లకు కట్టి చూపించారు.

ఇదే ఎపీసోడ్ లో తన అల్లుడు నారా లోకేశ్ ను కూడా తీసుకచ్చి కూతురుతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఇక తర్వాతి ఎపీసోడ్ లో మరో ఇద్దరు పొలిటీషియన్స్, తన స్నేహితులతో పాటు సీనియర్ నటి రాధికను ఇంటర్వ్యూ చేశారు. తర్వాత ఎపీసోడ్ లో సీనియర్ నటీమణులతో యంగ్ హీరోయిన్ ఇలా ప్రతీ ఎపీసోడ్ ను అందంగా తీర్చి దిద్దుతున్నారు బాలకృష్ణ.

భారీ స్థాయిలో వ్యూవ్స్

రీసెంట్ గా వచ్చిన ఎపీసోడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ను తీసుకచ్చారు. ఈ ఎపీసోడ్ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. బాహుబలి ఎప్పుడు అంటూ ప్రేక్షకుల నుంచి వస్తున్న కామెంట్లను పరిశీలించిన ‘ఆహా’టీం ఎట్టకేలకు ఈ ఎంట్రీని డిక్లేర్ చేసింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వినిపించాయి. ప్రభాస్ పెళ్లి విషయంపై ఇందులో చర్చ ఉంటుందని ఒక టీజర్ కూడా బయటకు రావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఎపీసోడ్ కోసం వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు. అది కూడా రానే వచ్చింది. బాలయ్య, ప్రభాస్ కాంబోలో జరిగిన ఈ షోలోని విశేషాలు ఇప్పటికీ నెట్టింట్లో ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి.

రికార్డులు దక్కించుకుంటున్న ఎపీసోడ్

ఈ ఎపీసోడ్ కు రికార్డు కూడా కట్టబెట్టారు ప్రేక్షకులు. అత్యంత ఎక్కువ వ్యూవ్స్ కలిగి ఉన్న ఎపీసోడ్ గా దీనికి గుర్తింపు దక్కింది. ఇందులో ప్రభాస్ తో పాటు ఆయన స్నేహితుడు సమకాలీన నటుడు అయిన గోపీచంద్ కనిపించారు. ఇంకా ఫోన్ లో రామ్ చరణ్ కూడా షోను పలకరించారు. ఈ షో ఆసాంతం ప్రభాస్ పెళ్లి విషయంపై ముడిపడడంతో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ వివాహం గురించి ఏం చెబుతారా అంటూ ప్రేక్షకులు ఆసక్తిని కనబర్చారు. దీంతో పాటు రామ్ చరణ్, గోపీచంద్ కూడా ప్రభాస్ పెళ్లి వార్తలు లీక్ చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రభాస్ సిగ్గుపడుతూ పిలవడం హైలట్

2023లో ప్రభాస్ ఒక ఇంటివాడు కాబోతున్నాడంటూ లీకులు కూడా ఇచ్చారు ఇదర్దు ఫ్రెండ్స్. ఇవన్నీ పక్కన పెడితే ఈ షోలో తనను డార్లింగ్ అంటూ పిలవాలని బాలయ్య కోరడం. ప్రభాస్ కూడా సిగ్గుపడుతూ పిలవడం హైలట్ గా నిలిచిందనే చెప్పాలి. ఇంత సిగ్గరి అయిన ప్రభాస్ హీరోయిన్లతో ఎలా నటిస్తున్నాడు అన్న విషయంపై అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏది ఏమైనా ఈ ఎపీసోడ్ మాత్రం షోకే హైలట్ గా మారింది. ఇక తర్వాతి ఎపీసోడ్ లో పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఇన్వైట్ చేస్తున్నట్లు గాసిప్ లు వినిపిస్తున్నాయి. కానీ ‘ఆహా’ మాత్రం ఇప్పటికీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.