ఆ సినిమా ఓటీటీ రిలీజ్ అడ్డుకున్న కోర్టు.. అందుకేనా..!

0
343

సామ్ లేడీ ఓరియంటెడ్ మూవీ ‘యశోద’ ఓటీటీ రిలీజ్ ను హైదరాబాద్ సివిల్ కోర్టు అడ్డుకుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మూవీ ఓటీటీ రిలీజ్ ను ఆపేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సమంతో పాటు డైరెక్టర్లు హరీశ్, హరి, ప్రొడ్యూసర్ కృష్ణ ప్రసాద్ ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్నారు. ‘యశోద’కు ఓటీటీ గండాలు తప్పడం లేదు.

ముందు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అడ్డుకుంది

కోర్టు తీర్పుకంటే ముందు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అడ్డుకుంది. పెద్ద చిత్రాలను దాదాపు 90 రోజుల తర్వాతనే ఓటీటీలో విడుదల చేయాలనే నిబంధన ఉందని దీన్ని ఉల్లంఘించి రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని సూచించారు. ఈ గండాన్ని దాటుకొని త్వరలో రిలీజ్ చేస్తామన్న చిత్ర యూనిట్ కు ఇప్పుడు ఈ కేసు మరో తలనొప్పిగా మారింది.

అసలేం జరిగింది

చిత్రంలో తమ అనుమతి లేకుండా తమ సంస్థ పేరును వాడుకున్నారని దీంతో తమ సంస్థకు, తమ ప్రతిష్టకు భంగం కలిగిందంటూ ‘ప్రశాంతి సెంటర్ ఫర్ ఫెర్టిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ నడుపుతున్న ఇవా ఐవీఎఫ్’ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తమ సంస్థ రెపిటేషన్ దెబ్బతీసేలా ఉన్నాయంటూ సంస్థ పేర్కొంది. తమ సంస్థను విదేశాలలో విస్తరించేందుకు ప్లాన్ చేసుకుంటున్న సమయంలో శ్రీదేవి ప్రొడక్షన్స్ పై వచ్చిన ఈ మూవీ విఘతం కలిగించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. థియేటర్స్ లోనూ చిత్రం ప్రదర్శనను నిలిపివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

విడుదల ఆగిపోయినట్లే

తమ సంస్థ పేరును వాడి అందునా నెగెటివ్ రోల్ లో వాడారని సంస్థ నిర్వాహకులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు స్పందించింది. బుధవారం రోజు విచారణ చేపట్టింది. వాద ప్రతివాదాలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ జరిగేంత వరకూ ఓటీటీలో ‘యశోద’ విడుదల చేయద్దని ఆదేశాలు జారీ చేసింది. థియేటర్లలో చిత్ర ప్రదర్శన కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.