శ్రీదేవితో పెళ్లి క్యాన్సల్ చేసుకున్న యంగ్ యాంగ్రీమన్

0
613

అప్పుడప్పుడూ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలు పిల్లల భవిష్యత్ లో పెను మార్పులను తీసుకువస్తాయి. ఒక హీరో తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి స్టార్ హీరోయిన్ ను జీవిత భాగస్వామిగా మిస్ చేసుకున్నాడు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

దివి నుంచి భువికి దిగొచ్చిన దేవకన్య

అతిలోక సుందరి శ్రీదేవి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దివి నుంచి భువికి దిగొచ్చిన దేవకన్యలా ఉంటుంది. తన నటన, అందంతో అందరినీ మంత్ర ముగ్ధులను చేసేంది. సమకాలిన హీరోలతో పోటీ పడుతూ మకుటం లేని మహారాణిలా వెండితెరను ఏలింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసి వెండితెరపై తనకో పేజీని సంపాదించుకుంది శ్రీదేవి. ఇంతటి అందం, క్రేజ్ లో ఉన్న హీరోయిన్ ను సొంతం చేసుకునేందుకు ఎవ్వరైనా ఉత్సాహం చూపించక మానరు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు దర్శకులు, నిర్మాతలు, హీరోలు క్యూ కట్టే వారట. కానీ ఒక హీరోకు ఆ ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకున్నారట.

రాజశేఖర్ గురించి

యాంగ్రీ యంగ్ మన్ గా గుర్తింపు సంపాదంచుకున్న రాజేశేఖర్ చిత్ర విలక్షణ నటుడు. వృత్తి రీత్యా వైద్యుడు అయినా తర్వాత టాలీవుడ్ ఇండస్ర్టీకి వచ్చి నటనలోనూ రాణించాడు. రాజశేఖర్ 1985లో ‘వందే మాతరం’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అనేక పాత్రలను పోషించాడు. పోలీస్ రోల్ లో ఆయన తీసిన అంకుశం ఆయనకు విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టింది. సాయికుమార్ వాయిస్ తో ఆయన నటనా శైలి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

పెద్దల ద్వారా

రాజశేఖర్, శ్రీదేవి ఇద్దరిదీ తమిళనాడే.. వీరి తండ్రులు కూడా మంచి స్నేహితులు. ఈ క్రమంలో ఇద్దరు కూడా తమ పిల్లలకు పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు ఒక ప్రపోజల్ తెచ్చారట. నటి శ్రీదేవికీ, డాక్టర్ రాజశేఖర్ తో వివాహం చేయాలని అనుకున్నారట కానీ రాజశేఖర్ తల్లి మాత్రం నటిని ఇంటి కోడలిగా తెచ్చుకోవడానికి ఇష్ట పడలేదట. అప్పటికీ రాజశేఖర్ సినిమాల్లోకి రాలేదు. కానీ శ్రీదేవి మాత్రం స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్నారు. తల్లి నిర్ణయం మేరకు రాజశేఖర్ కూడా పెళ్లిని వద్దనుకున్నారట.

మరి జీవిత ఎంట్రీ ఎలా

రాజశేఖర్ కూడా టాలీవుడ్ కు ఎట్రీ ఇచ్చి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ‘మగాడు’ సినిమా షూటింగ్ సమయంలో రాజశేఖర్ గాయాలపాలయ్యాడట. దీంతో ఆయనకు జీవిత సమస్యలు చేసిందట. అది చూసిన రాజశేఖర్ తల్లిదండ్రులు జీవితను రాజశేఖకు ఇచ్చి వివాహం జరిపించారట. అంత పెద్ద స్టార్, అందాల సుందరిని కాదని రాజశేఖర్ జీవితను పెళ్లి చేసుకున్నాడు. అయినా వారి దాంపత్యం చాలా ఆనందంగా ఉంటుంది.

ఆయనకు ఎనలేని ప్రేమ

జీవిత చాలా సినిమాలకు దర్శకత్వం వహించింది. తన భర్తను హీరోగా పెట్టి తీసిన సినిమాలు ఇండస్ర్టీలో బాక్సాఫీస్ హిట్లను సాధించాయి. రాజశేఖర్ కూతురు కూడా ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తోంది. ఒక హీరోయిన్ ను కోల్పోయానికి ఇప్పటికీ రాజశేఖర్ అనుకోలదంట. జీవిత అంటే ఆయనకు ఎనలేని ప్రేమ ఆమె లేకుండా రాజశేఖర్ ఉండలేడు అనేది జగమెరిగిన నిజం.